కిరాణా కొట్టు యజమాని ఖాతాలో రూ. 3.70 కోట్ల సైబర్ చీటింగ్ మనీ

by Kodari Anjali |   (  Updated:2026-01-06 16:51:57  IST  )

కమీషన్ కోసం ఆశపడి తన బ్యాంక్ ఖాతాను అమ్ముకున్న ఓ కిరాణా కొట్టు యజమాని జైలు పాలైయ్యాడు.

కిరాణా కొట్టు యజమాని ఖాతాలో రూ.  3.70 కోట్ల సైబర్ చీటింగ్ మనీ
X

దిశ, సిటీక్రైం: కమీషన్ కోసం ఆశపడి తన బ్యాంక్ ఖాతాను అమ్ముకున్న ఓ కిరాణా కొట్టు యజమాని జైలు పాలైయ్యాడు. స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ. 50 లక్షలు కొల్లగొట్టిన కేసు దర్యాప్తులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి గత డిసెంబరులో వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ కు స్పందించగానే మీనా భట్ పేరుతో ఓ మహిళ వాట్సాప్ కాల్ చేసి పరిచయం చేసుకుని స్టాక్ ట్రేడింగ్ లో భారీ లాభాలు, ఐపీఓ షేర్‌ల అలాట్‌మెంట్‌లో అధిక ఆదాయం చూపిస్తామని నమ్మించింది. మాటలకు బోల్తపడ్డ బాధితుడు ఆమె చెప్పినట్లు పెట్టుబడిని పెట్టాడు.

బాధితుడు స్పందించకపోవడంతో

అతనికి కేటాయించిన పేజీలో ఆదాయ కనిపిస్తున్నప్పటికి వాటి విత్‌డ్రాకు అనుమతించ లేదు. ఇంకా డబ్బులు పెట్టుబడిగా పెట్టాలని ఒత్తిడి చేశాడు. బాధితుడు స్పందించకపోవడంతో అతనిని గ్రూపులో నుంచి తొలగించారు. దీంతో అనుమానం వచ్చిన తనను గుర్తు తెలియని వ్యక్తులు 50 లక్షల రూపాయాల వరకు మోసం చేశారని ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన సైబర్ క్రైం పోలీసులు బాధితుడు ఖాతా నుంచి బదిలీ అయిన బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా ఓ ఖాతా హైదరాబాద్ కు చెందిన కిరాణా కొట్ట యజమాని మహ్మాద్ అష్వాక్ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు.

అదుపులోకి తీసుకుని విచారించగా

అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా ఢిల్లీలో పరిచయమైన సైబర్ మోసగాళ్లకు తన బ్యాంక్ ఖాతాను కమీషన్ మీద ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఖాతాలో దేశ వ్యాప్తంగా నమోదైన దాదాపు 29 కేసుల్లోని రూ. 3.70 కోట్ల నగదు జమైనట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఈ ఖాతాలో వచ్చిన డబ్బును సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా విదేశాలకు తరిలించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మహ్మాద్ అష్వాక్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలు ఎవరు కూడా గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతాలను, కమీషన్ ల కోసం ఆశపడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read More : గూగుల్ రివ్యూలు ఇస్తే డబ్బులు వస్తాయా? తెలంగాణ పోలీసులు ఏం చెబుతున్నారంటే?

Next Story