- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డెక్కితే తప్ప వేతనాలు రావా..? ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
ఉద్యోగులకు జీతం కావాలంటే రోడ్డెక్కాల్సిందేనా? అని ప్రభుత్వాన్ని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు

దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగులకు జీతం కావాలంటే రోడ్డెక్కాల్సిందేనా? అని ప్రభుత్వాన్ని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) ప్రశ్నించారు. హైదరాబాద్ (Hyderabad) లోని నిమ్స్ ఆసుపత్రిలో (NIMS Hospital) పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది (Security Staff) తమకు జీతాలు (Salaries) చెల్లించలేదని నిరసనకు (Protest) దిగారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. నిమ్స్ సెక్యూరిటీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా, వారిని రోడ్డెక్కే దుస్థితికి నెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు.
అలాగే ఎంతో అంకిత భావంతో ఆస్పత్రికి రాత్రింబగళ్ళు సేవలు అందిస్తున్న సిబ్బంది ప్రతి నెల జీతాలు కోసం చేతులు జోడించి అడగాల్సి వస్తున్నదని, రోడ్డెక్కి పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదని ఆరోపించారు. అంతేగాక ఉద్యోగుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు. ఎన్నికల ముందు తీయటి మాటలు, ఇప్పుడేమో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ మోసపూరిత పాలనకు ఇదే నిదర్శనమని అన్నారు. ఇక "ప్రతినెల మా జీతం మాకు ఇవ్వండి" అని ఉద్యోగులు రోడ్డెక్కి మొరపెట్టుకోవాల్సి రావడం శోచనీయమని దుయ్యబట్టారు. కష్టజీవుల న్యాయమైన హక్కులను కాలరాస్తూ, వారి కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయమా? అని అడిగారు. నిమ్స్ సెక్యూరిటీ సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతినెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.






