- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ లగ్జరీ కార్లపై బీఆర్ఎస్ పార్టీ నడుస్తుందా: కేంద్ర మంత్రి బండి సంజయ్
కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ఎక్స్ వేదికగా కేటీఆర్ ను ప్రశ్నిస్తూ.. "కార్ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా? అని అనుమానం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay).. బీఆర్ఎస్ పార్టీతో పాటు కేటీఆర్ (KTR) పై లగ్జరీ కార్ స్కామ్ (Luxury car scam) అంటూ కీలక ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ వేదికగా కేటీఆర్ ను ప్రశ్నిస్తూ.. ట్వీట్ చేశారు. అందులో "కార్ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా? లగ్జరీ కార్ స్కాం నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్ (Land Cruiser)లో ట్విట్టర్ టిల్లు ఎందుకు తిరుగుతున్నాడు? ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని అనుమానం వ్యక్తం చేశాడు. అలాగే ఆ కారుకు మార్కెట్ ధర చెల్లించారా? లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా? పేమెంట్లు బినామీ పేర్లతో చేశారా..? ఆ డబ్బు మొత్తం నకిలీ ఆదాయమా? లేక మనీలాండరింగ్ ద్వారా వచ్చిందా అంటూ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే ఈ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ కారు స్కామ్ కు సంబంధించిన వాస్తవాలు బయటకు రావాలి. సంబంధిత శాఖలు వెంటనే ఇన్వెస్టిగేట్ చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.






