రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తవా.. హరీశ్ రావు సంచలన సవాల్

by Kema Shiva Kumar |

పదేళ్ల హయాంలో కట్టిన ప్రాజెక్టులన్నీ ఒకదాని వెంట మరొకటి కూలిపోతున్నాయని, బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ పాలనల తెలంగాణ (Telangana)కు తీరని నష్టం వాటిల్లిందని బుధవారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్నాయి.

రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తవా.. హరీశ్ రావు సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల హయాంలో కట్టిన ప్రాజెక్టులన్నీ ఒకదాని వెంట మరొకటి కూలిపోతున్నాయని, బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ పాలనల తెలంగాణ (Telangana)కు తీరని నష్టం వాటిల్లిందని బుధవారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని కామెంట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్‌పై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు.

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) సర్కార్ 18 నెలల్లో 18 ఎకరాలకైనా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖలో తాము ఉద్యోగాలు ఇచ్చినట్లుగా నిరూపిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా.. అని సవాలు విసిరారు. ఎస్ఎల్‌బీసీ (SLBC) ప్రాజెక్ట్ విషయంలో రేవంత్‌ది గోబెల్స్ ప్రచారమని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాడు ఎస్ఎల్‌బీసీకి రూ.3,900 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. ఏపీ ప్రభుత్వానికి సీఎం పూర్తిగా దాసోహమై.. వాళ్లకు విచ్చలవిడిగా నీళ్లు వదులుతున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచంలో పాకిస్తాన్ దేశానికి ఎవరైనా అప్పు ఇస్తున్నారు గాని.. రేవంత్ రెడ్డికి అప్పు ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ప్రభుత్వమే ఆలోచన చేయాలని హరీశ్ రావు అన్నారు.

Next Story