- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరూపించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. ఏలేటి సెన్సేషనల్ చాలెంజ్
రేవంత్ రెడ్డి చుట్టూ చెడ్డీ గ్యాంగ్ ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలే తప్ప మరేమి లేవని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో హెచ్‍సీయూ భూములను కాజేసే ప్రయత్నం చేశారని కేంద్ర ప్రభుత్వం రంగప్రవేశం చేయడంతో వెనుకడుగు వేసిందని ఇప్పుడు హిల్ట్ భూములను ముట్టుకోవాలంటే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు కావాలని ఆ పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా అని ప్రశ్నించారు. తెలంగాణలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న "ప్రజా వంచన" పాలనను, పెండింగ్‌లో ఉన్న హామీల అమలును నిరసిస్తూ ఇవాళ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ బీజేపీ మహా ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో పాల్గొన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ ఆదేశిస్తే హిల్ట్ భూముల విషయంలో అక్రమాలు రుజువులతో సహా నిరూపిస్తానని ఒకవేళ అలా నిరూపించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని చాలెంజ్ విసిరారు. పార్టీ ఆదేశిస్తే ఈ విషయంలో ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనుకాడనని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి కాదు రాబందు రెడ్డి:
అనేక కుంభకోణాల్లో కూరుకుపోయిన రేవంత్ రెడ్డి ఒక చెడ్డీ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఎక్కడ భూములు కనిపిస్తే ఆ చెడ్డీ గ్యాంగ్ అక్కడ వాలిపోతున్నారని హిల్ట్ భూముల వెనుక ఉన్నది కూడా ఆ చెడ్డీ గ్యాగేనన్నారు. రేవంత్ రెడ్డి చెడ్డీ గ్యాంగ్‍ను ప్రోత్సహిస్తూ రాబందు రెడ్డిలా మారారని ఎద్దేవా చేశారు. హిల్ట్ ప్రాంతంలోని పరిశ్రమలకు భూములకు బదులు భూములు ఇస్తే సరిపోతుంది కానీ ఆ పని ఎందుకు చేయడంలేదని నిలదీశారు. పరిశ్రమల కాలుష్యంపై ఎక్కడ ఎలాంటి అధ్యయనం చేయలేదని, పరిశ్రమలను ఎక్కడికి తరలించాలనే ప్రయత్నాలు జరగలేదన్నారు. నిజంగా కాలుష్యం నియంత్రించాలనేదే మీ ఉద్దేశం అయితే కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలను తరలించే పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. అక్కడ రియల్ ఎస్టేట్ కు అవకాశం లేకపోవడం వల్లే ఆ పని చేయడం లేదని కానీ హిల్ట్ ప్రాతంలో లంకెబిందెలు దొరుకుతాయి కాబట్టే ఈ పాలసీని పేరుతో అక్రమాలకు తెరలేపారని ధ్వజమెత్తారు.






