రాజకీయాలు వదిలేస్తా.. సీఐడీ విచారణ అనంతరం కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-04-04 12:08:19  IST  )

హుజూరాబాద్ ఘటనపై సీఐడీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. విచారణ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాలు వదిలేస్తా.. సీఐడీ విచారణ అనంతరం కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఐడీ విచారణ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసుల పేరుతో ఇబ్బందులు పెడితే భయపడేది లేదని, నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని అప్పుడు కేసులు తిరగబడతాయని హెచ్చరించారు. జనవరి 29న హుజూరాబాద్‍లో సమ్మక్క జాతర వేళ గొడవ చోటు చేసుకుంది. పోలీసుల విధుల్లో అడ్డంకి, దూషణలు, మతవిద్వేష వ్యాఖ్యలు చేసినట్లు కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇటీవల విచారణకు రావాల్సిందిగా సీఐడీ అధికారులు కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. దీంతో ఇవాళ కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన భార్య శాలినిరెడ్డి హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. దాదాపు నాలుగు గంటల పాటు అధికారులు విచారణ జరిపారు. విచారణను వీడియో రికార్డు చేశారు.

Next Story