- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రేషన్ కార్డు కట్!.. ప్రభుత్వంపై కవిత సీరియస్
రేషన్ కార్డుల రద్దు, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఐటీఆర్ ఫైల్ చేసిన వారి రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తోందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మండిపడ్డారు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు రేషన్ కార్డుల అంశం మారిందని, గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదంటూ ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం (Ration Card Cancellation)పెట్టుకుందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం 5 లక్షల రేషన్ కార్డులు ఇస్తే 10 నుంచి 15 లక్షల రేషన్ కార్డులను తీసేసే ప్రయత్నం చేస్తోందని, ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని, చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో రేషన్ కార్డులు ఏరివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చిరుద్యోగులకు మేలు జరిగే రేషన్ కార్డుల ఏరివేసే పైశాచిక ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవాళ బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె పలు అంశాలపై స్పందించారు.
ఉద్యోగాలు దక్కకుండా అడ్డంకులు:
యువతకు ఉద్యోగాలు దక్కకుండా జీవోలతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కవిత ఆరోపించారు. డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలను తమవారికే ఇచ్చేలా జీవో నంబర్ 4 తీసుకొచ్చిందన్నారు. హీహెచ్‍డీకి 25 మార్కులు వెయిటేజ్ ఇవ్వటం కూడా కుట్రలో భాగమేనన్నారు. గ్రూప్-1 లో ఏ విధంగా తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారో... ఇప్పుడు అదే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి నోటిఫికేషన్‍కు ఏదో ఒక జీవో అడ్డం పెట్టి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డీఎస్సీ కి జీవో నంబర్ 104, గ్రూప్స్ కు జీవో నంబర్ 29, పోలీసు ఉద్యోగాలకు జీవో నంబర్ 46, గురుకులాలకు జీవో నంబర్ 81 లు అడ్డంకిగా ఉన్నాయన్నారు.
ఎత్తున పోరాటం చేస్తాం:
వెంటనే ఈ జీవోలను రివ్యూ చేసి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరుద్యోగులను సమాయాత్తం చేసి ప్రభుత్వం పై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ యువతను కాంగ్రెస్ తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుందని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ హామీ ఇచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చెబితే నమ్మరని రాహుల్ గాంధీతో అశోక్ నగర్‍లో హామీ ఇప్పించారు. రాష్ట్రంలో 30 నుంచి 40 లక్షల కుటుంబాల్లో విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. నేను తొక్కుకుంటూ పైకి వచ్చాను అంటూ ముఖ్యమంత్రి చెబుతుంటారు. నిజంగానే నిరుద్యోగుల నెత్తి మీద కాలు పెట్టి తొక్కుకుంటూ మీరు అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. నోటిఫికేషన్లు వేసే వరకు ప్రభుత్వంతో ఫైట్ చేస్తామని ఇంతమంది నిరుద్యోగుల కన్నీటి గాథలు ఇలా ఉంటే... ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం ఆటలు ఆడుతున్నారంటే నిరుద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం చాలా లైటర్ వే లో ఆలోచిస్తోందని అర్థమవుతోందన్నారు.
బాలింతలకు డబ్బులు కిట్‍లు బంద్ చేశారు:
ఈ ప్రభుత్వం వచ్చాక బాలింతలకు డబ్బులు, కిట్‍లు ఇవ్వటం మానేసిందని అంగన్‍వాడీలకు జీతాలు కూడా సరిగా ఇవ్వటం లేదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఏడు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వటం లేదు. కానీ మూసీకి మాత్రం 7 వేల కోట్లు కేటాయించారని ఆరోపించారు. హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. 9 నెలల క్రితం పెట్టిన నర్సింగ్ ఎగ్జామ్ ఫలితాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని ఇన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యే జీవోల మీద రివ్యూ చేసే సమయం ఈ ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు.






