- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)తో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) భేటీ అయ్యారు. నందనగర్‌లోని నివాసంలో కలిశారు. తాజా రాజకీయాలపై ఇరువురు చర్చించుకున్నారు. అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఎత్తు పల్లాలు ఉంటాయని అన్నారు. కొన్నిసార్లు ప్రజలు ఆమోదిస్తారు.. కొన్నిసార్లు తిరస్కరిస్తారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల్లో ఉండాలి.. మన వాదన బలంగా వినిపించాలి.. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. త్వరలో కేసీఆర్‌ను కలుస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డితోనూ అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కలిశారు. వివిధ రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్‌కు రేవంత్‌రెడ్డి వివరించారు.






