- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR: అసెంబ్లీ స్పెషల్ సేషన్‌కు కేసీఆర్ వచ్చేనా?
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను గుర్తు చేసుకునేందుకు రేపు జరిగే స్పెషల్ అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ వస్తారా? లేదా? అనే చర్చ జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను గుర్తు చేసుకునేందుకు రేపు జరిగే స్పెషల్ అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ వస్తారా? లేదా? అనే చర్చ జరుగుతున్నది. సభకు వచ్చి మన్మోహన్ తో తనకు ఉన్న సానిహిత్యాన్ని వివరిస్తారా? లేకపోతే ఎప్పటిలాగే ఫామ్ హౌజ్‌కే పరిమితం అవుతారా? అనే ఆసక్తి నెలకొన్నది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మన్మోహన్‌తో ఏ రాజకీయ నాయకుడుకు లేని వ్యక్తిగత పరిచయం కేసీఆర్‌కు ఉంది. ఆయన కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. శాఖపరమైన అంశాలకోసం ఆయనతో పలు సార్లు బేటీలు జరిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పలుసార్లు పార్టీ తరుపున, వ్యక్తిగతంగా కలిశారు. మన్మోహన్ సైతం కేసీఆర్ కలిసినప్పుడు ‘రావు సాబ్’ అని ఆప్యాయంగా పిలిచేవారనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఆయనతో అంతటి వ్యక్తిగత పరిచయం ఉన్న కేసీఆర్ అసెంబ్లీ ప్రత్యేకసమావేశానికి వచ్చి, మన్మోహన్‌తో తనుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే బాగుంటుదని చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. ఒకవేళ ఎప్పటిలాగే సభకు దూరంగా ఉంటే ఆయనపై విమర్శల జోరు మరింత పెరిగే ప్రమాదం ఉంటుందని గులాబీ కేడర్ నుంచే అనుమానాలు మొదలయ్యాయి.






