కేటీఆర్‌కు కవిత రాఖీ కడతారా?

by Muthe.Rajitha |   (  Updated:2025-08-08 16:53:47  IST  )

కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత పోరు గురించి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతానం కేటీఆర్, కవితల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే అంతర్యుద్ధం జరుగుతోంది.

కేటీఆర్‌కు కవిత రాఖీ కడతారా?
X

దిశ, వెబ్ డెస్క్ : కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత పోరు గురించి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతానం కేటీఆర్, కవితల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే అంతర్యుద్ధం జరుగుతోంది. అయితే అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ వేడుకగా వీరు ఇరువురు మధ్యనున్న మనస్పర్థలకు ముగింపు పలుకుతారా లేదా అని ఇద్దరి అభిమానులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. కాగా ప్రతియేటా కవిత స్వయంగా కేటీఆర్ నివాసానికి వెళ్లి రాఖీ కట్టి ఇరు కుటుంబాలు పండగను సెలెబ్రేట్ చేసుకునేవాళ్ళు.

గతేడాది రాఖీ సమయంలో లిక్కర్ స్కామ్ కేసులో కవిత తీహార్ జైలులో ఉంది. అయితే రాఖీ పౌర్ణమి మరుసటి రెండు రోజులకే కవిత బెయిల్ మీద బయటికి రావడంతో ఢిల్లీలోని బీఆర్ఎస్ భవన్ లో అంగరంగవైభంగా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు కవిత కేటీఆర్ కు రాఖీ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇటీవల కవిత కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ కావడం, తాను కేసీఆర్ తప్ప ఎవరి కింద పనిచేయను అని కవిత అనడం, పరోక్షంగా కేటీఆర్ మీద విమర్శలు, ఆరోపణలు చేయడంతో ఇద్దరిమధ్య అంతర్గత గొడవలు రచ్చకు ఎక్కాయి.

ఇటీవల తీన్మార్ మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ కేటీఆర్ గాని, బీఆర్ఎస్ వర్గీయులు గాని ఎలాంటి ఖండన చేయలేదు. ఈ నేపథ్యంలో మరి రేపు కవిత తన అన్న కేటీఆర్ కు రాఖీ కడుతుందా లేదా అనేది తీవ్ర ఉత్సుహకతను రేపుతోంది. కవిత వర్గీయుల ప్రకారం ప్రతియేడు జరుపుకున్నట్టే ఈ ఏడాది కూడా కవిత కవిత కేటీఆర్ ఇంటికి రాఖీ కట్టనుందని సమాచారం.

Next Story