జగ్గారెడ్డికి ఉపముఖ్యమంత్రి పదవి.. బంపర్ ఆఫర్‌కు ఓకే చెప్తారా?

by Rajesh |
జగ్గారెడ్డికి ఉపముఖ్యమంత్రి పదవి.. బంపర్ ఆఫర్‌కు ఓకే చెప్తారా?
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగ్గారెడ్డిని ప్రజాశాంతి పార్టీలోకి కేఏపాల్ ఆహ్వానించారు. జగ్గారెడ్డికి ఉప ముఖ్య మంత్రి పదవి ఇస్తామన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు సంగారెడ్డిలో 12 ఉద్యోగాలు కల్పిస్తాననని కేఏపాల్ అన్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. ఇదే విషయమై ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి తాను పార్టీ మారడం లేదంటూ జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే కేఏపాల్ తాజా ఆఫర్ పై జగ్గారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Next Story

Most Viewed