పద్మ శ్రీ పై పార్లమెంట్​లో చర్చిస్తా.. ఎంపీ చామల కిరణ్ రెడ్డి

by Ramesh Goud |

పద్మ శ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ జీరో అవర్ లో లెవనెత్తుతానని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి అన్నారు.

పద్మ శ్రీ పై పార్లమెంట్​లో చర్చిస్తా.. ఎంపీ చామల కిరణ్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పద్మ శ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ జీరో అవర్ లో లెవనెత్తుతానని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి అన్నారు. బండి సంజయ్​ కార్పొరేటర్​ కాదు.. కేంద్ర మంత్రి అన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. గాంధీ భవన్​లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్, బీజేపీలపై ఘటూగా విమర్శించారు. హైదరాబాద్​కు ఆర్ఆర్ఆర్ లైఫ్ లైన్ అని, దానికి 45వేల కోట్లు అవసరమని అంచనా వేయడం జరిగిందన్నారు. ఆర్ఆర్ఆర్, మెట్రోతో హైదరాబాద్ గ్లోబల్ సిటీ గా మారనుందన్నారు. దీనిపై కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీలు కలువడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లికి పోయాడో? కేటిఆర్ ను అడిగితే వ్యంగ్యంగా చెప్తాడని అన్నారు.

ఆర్ఆర్ఆర్ కు అనుసంధానంగా రేడియల్​ రోడ్లు నిర్మించ తలపెట్టామని, దీనిని హైదరాబాద్​నగరం చుట్టూరా 70 కిలోమీటర్ల మేర డెవలప్​మెంట్​అయి పట్టణాలు ఏర్పడుతాయన్నారు. ఇందుకోసం ఈ పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలలో నిధులు తీసుకువచ్చేందుకు ఎంపీలంతా కృషి చేయాలని సూచించారు. మహారాష్ట్ర కంటే తెలంగాణ ఎక్కువగా కేంద్రానికి జీఎస్టీ పే చేస్తుందని పేర్కొన్నారు. పది ఏండ్లు రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వాస్తవానికి కేంద్రం బీహార్ కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యం తెలంగాణకు ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణలో బీజీపీ 8 మంది ఎంపీలు ఉన్నా.. కేంద్రం వారిని గుర్తించడం లేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కాంగ్రెస్​ ఎంపీలకు ఎంత బాధ్యత ఉందో? అంతే బీజీపీ ఎంపీలకు ఉందన్న విషయాన్ని ఎంపీ చామల గుర్తు చేశారు.

విభజన హామీలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో లోకసభలో బీజేపీ ఎంపీలు మాట్లాడాలని సూచించారు. రాజకీయంగా విమర్శలు చేయడం తప్పు లేదని, అధికారంలో ఉన్నవారు తప్పు చేస్తే నిలదీసేందేకే ప్రతిపక్షం ఉందన్నారు. తాము గత పదేళ్లలో ప్రశ్నించాల్సిన అంశం ఉంటేనే గొంత్తెతేదని, కేటీఆర్​అలా కాదు.. రోజుకో మూడు ప్రెస్​మీట్లు, నాలుగు ట్విట్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్​పాలన చూసి ఓర్వలేని తనంతోనే చేస్తున్నారని విమర్శించారు. నల్లగొండలో కేటీఆర్ కామెడీ షో చేసి వచ్చాడని పేర్కొన్నారు. కేటీఆర్ రైతు ధర్నా అట్టర్ ప్లాప్ అయిందన్నారు. ఆయన ధర్నాకు రైతుల నుంచి కనీస మద్దతు లేదన్నారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతు రుణమాఫీ, రైతు భరోసా ,సన్న వడ్లకు బోనస్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర మా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఈ సందర్భంగా చామల కిరణ్​కుమార్​రెడ్డి స్పష్టం చేశారు.

Next Story