TG News : రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తా : రావి శ్రీనివాస్

by Muthe.Rajitha |

మంత్రి సీత‌క్క(Minister Seethakka)పై ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఆసిఫాబాద్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్(Ravi Srinivas) ను స‌స్పెండ్(Suspension) చేసిన సంగతి తెలిసిందే.

TG News : రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తా : రావి శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్ : మంత్రి సీత‌క్క(Minister Seethakka)పై ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఆసిఫాబాద్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్(Ravi Srinivas) ను స‌స్పెండ్(Suspension) చేసిన సంగతి తెలిసిందే. త‌న‌కు వ్యతిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టార‌ని ఆరోపిస్తూ శ్రీనివాస్ పై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవ‌హారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు సీతక్క ఫిర్యాదు చేయడంతో రావి శ్రీనివాస్‌ను పార్టీ నుండి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఈ సస్పెన్షన్ పై రావి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. తనను సస్పెండ్ చేస్తారని ముందుగానే ఊహించానని తెలిపారు. సీతక్క ఇచ్చిన ఫిర్యాదుతో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో దీనికి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని, అందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

Next Story