తెలంగాణకు వస్తా: హిమాచల్ ప్రదేశ్ CM

by Gantepaka Srikanth |

తెలంగాణకు వస్తా: హిమాచల్ ప్రదేశ్ CM

తెలంగాణకు వస్తా: హిమాచల్ ప్రదేశ్ CM
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు తప్పకుండా హాజరవుతానని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హామీ ఇచ్చారు. ఈనెల 8, 9 తేదీల్లో తెలంగాణలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించేందుకు శుక్రవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ..హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు. ఈమేరకు సీఎం సుఖ్వీందర్ ను కలిసి ఈ సమ్మిట్ కు హాజరవ్వాలని ఆహ్వానించారు. తెలంగాణ డెవలప్‌మెంట్ సమ్మిట్ ఆలోచన అద్భుతమని ఈ సందర్భంగా హిమాచల్ సీఎం కితాబిచ్చారు.

Next Story