- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల పాత్ర వెలకట్టలేనిదని వారి సమస్యలను పరిష్కరించేందుకు వారికి ప్రభుత్వానికి వారధిగా ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

నిరుద్యోగులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- రాష్ట్ర ఏర్పాటులో నిరుద్యోగుల పాత్ర వెలకట్టలేనిది
- నిరుద్యోగులు అధైర్య పడొద్దు.. నిరసనలు, ధర్నాలు మానుకోండి
- మీ సమస్యలు వినడానికి మీదగ్గరికి నేనే వస్తా..
- గన్ పార్కు వద్ద నిరుద్యోగులతో కలిసి అమరవీరులకు నివాళి
దిశ, మునుగోడు: తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల పాత్ర వెలకట్టలేనిదని వారి సమస్యలను పరిష్కరించేందుకు వారికి ప్రభుత్వానికి వారధిగా ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం నిరుద్యోగుల ఆహ్వానం మేరకు హైదరాబాదులోని గన్ పార్క్ లో నిరుద్యోగులతో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అనంతరం ఆయన మాట్లాడారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో నిరుద్యోగుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయన్నారు. పదేళ్ల పాలనలో ఒక గ్రూప్ వన్ కూడా వేయలేకపోయారన్నారు. బీఆర్ఎస్ పాలన కుటుంబ పాలనగా కొనసాగి అవినీతిమయంగా మారి దోచుకుని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ యువత కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపించడానికి పోషించిన పాత్ర అమోఘమైనదన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటానని ఎవ్వరూ అధైర్య పడొద్దన్నారు. చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు. ప్రభుత్వం సెప్టెంబర్ 17ను కూడా ప్రజా పాలన దినోత్సవముగా జరుపుకుంటున్నామన్నారు. సోనియాగాంధీ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం పదేండ్ల కాలంలో సాకారం కాలేదని, రాబోయే రోజుల్లో మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యమయ్యే పని కాదు అయినా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు చదువుకున్న యువత తమ కాళ్ళ మీద నిలబడేలా ఉపాధి మార్గాలు చూపిస్తామన్నారు. మీకు న్యాయం జరిగే వరకూ మీ సమస్యలను ముఖ్యమంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. నిరుద్యోగులకు ధైర్యం చెప్పడానికి నేడు నేను ఇక్కడికి వచ్చానన్నారు. మీ సమస్యలు వినడానికి అవసరమైతే సెంట్రల్ లైబ్రరీకి, అశోక్ నగర్ చౌరస్తాకి, దిల్ సుఖ్ నగర్ కి వస్తానన్నారు. నిరసనలు, నిర్బంధాలు, ధర్నాలు అవసరం లేదని ఇది కాంగ్రెస్ ప్రభుత్వమని మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు.






