- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీ రూముల్లో కూర్చుని రైతు భవిష్యత్తు నిర్ణయిస్తారా?.. రైతు డిస్కంపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం
రైతు డిస్కం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: యావత్ రైతాంగ భవిష్యత్తును నిర్ణయించే రైతు డిస్కం అంశంపై హైదరాబాద్‍లో ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయం తీసుకోవడం బాధాకరం అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఖచ్చితంగా 33 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి రైతుల అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు. రైతు డిస్కమ్‌పై ERC నిర్వహించిన ప్రజా అభిప్రాయ సేకరణలో టీఆర్ఎస్ తరఫున కవిత తన వాదన వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు డిస్కమ్ పేరుతో ఈ ప్రభుత్వం రైతులను పచ్చి దగా చేస్తోందని నిజంగా ఈ నిర్ణయం మంచిదే అయితే ఆరు నెలల నుంచి ప్రభుత్వం ఎందుకు రహస్యంగా ఉంచిందని ప్రశ్నించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టలేదని నిలదీశారు. ఇది నిజంగా రైతులకు మేలే చేసేదే అయిదే ఖచ్చితంగా ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవారని కానీ ఇదేమి జరగలేదన్నారు. రైతు పేరుతో డిస్కం పెట్టి వారిని ఈ ప్రభుత్వం మోసగించే ప్రయత్నం చేస్తోందన్నారు.






