- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను పట్టించుకోవడం లేదు... భర్తను గొంతుకోసి హత్య చేసిన భార్య
నిద్రలో ఉన్న భర్తను భార్య గొంతుకోసి హత్య చేసింది. ఈ దారుణ ఘటన యూపీలోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముజఫర్‌నగర్‌లో సంజయ్ కుమార్ అతడి భార్య కవిత నివాసం ఉంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: నిద్రలో ఉన్న భర్తను భార్య గొంతుకోసి హత్య చేసింది. ఈ దారుణ ఘటన యూపీలోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముజఫర్‌నగర్‌లో సంజయ్ కుమార్ అతడి భార్య కవిత నివాసం ఉంటున్నారు. అయితే కవిత సంజయ్ కుమార్ రెండో భార్య కాగా ఇప్పటికే అతడికి మరో మహిళతో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో తనను పట్టించుకోకుండా మొదటి భార్యనే పట్టించుకుంటున్నాడని గత కొద్దిరోజులుగా కవిత భర్తతో గొడవ పడుతోంది.
ఈ క్రమంలోనే ఈ నెల 29న రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో అతడి గొంతు కోసి హత్య చేసింది. మృతుడి తండ్రి భోపాల్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసింది నింధితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తనను నిర్లక్ష్యం చేసినందుకే హత్య చేసినట్టు అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మృతుడి మొదటి భార్య అతడి స్వగ్రామం తాండా మజ్రాలో ఉంటుండగా రెండో భార్య ముజఫర్‌నగర్‌లో ఉంటుంది.






