మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎన్ఆర్ఐల మద్దతు.. బీఆర్ఎస్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల

by Disha Web Desk 6 |
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎన్ఆర్ఐల మద్దతు.. బీఆర్ఎస్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఎన్‌ఆర్ఐల మద్దతు పలికారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా మహిళా వింగ్ అధ్యక్షురాలు సంగీత ధూపాటి ఆధ్వర్యంలో సిడ్నీలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గ్లోబల్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల, మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఎన్ఆర్ఐల మద్దతుకు ప్రచారాన్ని ప్రారభించారు. ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐల మద్దతు కోసం మొదటిసారిగా ఆస్ట్రేలియాలో ప్రచారం ప్రారంభించామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు తమ మద్దతు తెలపాలని మహేష్ బిగాల కోరారు.

కవిత తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను ఖండాంతరాలకు వ్యాప్తి చెందేలా కృషి చేశారన్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం దేశవ్యాప్తంగా మహిళలను ఐక్యం చేసి బిల్లు ను సాధిస్తారని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు. సిడ్నీలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు, కన్వీనర్ రవిశంకర్ ధూపాటి , లివింగ్స్టున్ చెట్టిపల్లి, అమ్రీన్, గుల్షన్ ఆర, స్వప్న నెల్లీ, పరశురామ్ , అజాజ్, ఇస్మాయిల్, చిరాన్ పురంశెట్టి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed