- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయోధ్యలో సీతారాముల వారి విగ్రహాలు ఎందుకు పెట్టలేదు.. క్లారిటీ!
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. దేశ వ్యాప్తంగా ఈ వేడుకను ప్రజలు పండుగలా జరుపుకున్నారు. అన్నదానాలు, ప్రత్యేక పూజలు, శోభాయాత్రలు, టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అయితే చాలా మందిలో అయోధ్యలో బాల రాముడి విగ్రహం మాత్రమే ఎందుకు ప్రాణ ప్రతిష్ట చేశారు. సీతా రాముల వారి విగ్రహం ఎందుకు పెట్టలేదనే సందేహం కలిగింది. దాదాపు అన్ని రామాలయాల్లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న విగ్రహాలే దర్శనమిస్తాయి.
మరి అయోధ్యలో బాలరాముడి విగ్రహం ఎందుకు పెట్టారనే విషయంపై ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘సముద్ర గుప్త, విక్రమాదిత్య కాలం 1076-1126 సీఈకి ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉంది. అప్పుడే రామ్ లల్లా 5-6 అంగుళాల మూర్తి బాల రాములు ఉండే వారు.’ అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పష్టతనిచ్చారు. ఓ నెటిజన్ లల్లా అంటే అర్థం ఏమిటని ప్రశ్నించగా దానికి బదులిస్తూ ‘లల్లా అనేది సంస్కృత పదం అని.. అంటే చిన్న పిల్లవాడు అని అర్థం అని చాగంటి తెలిపారు.






