- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి అవకతవకలపై విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకంజ? : మహేశ్వర్ రెడ్డి
గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క సింగరేణిలో అనేక అవకతవకలు జరిగాయని, తాము అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క సింగరేణిలో అనేక అవకతవకలు జరిగాయని, తాము అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.23,486 కోట్ల విలువైన 36 ఓబీఆర్ కాంట్రాక్టులను కట్టబెట్టారు. ఇతర కోల్ మైన్స్ లో 10 నుంచి 15 శాతం తక్కువ ధరకే టెండర్లు దక్కించుకుంటుంటే, ఇక్కడ మాత్రం 12.5 శాతం నుండి 32 శాతం వరకు అధిక ధరకు టెండర్లు ఇచ్చి గుత్తేదారుల జేబులు నింపారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో జరిగిన రూ.1,000 కోట్ల మిస్ అప్రాప్రియేషన్ పై తాము ఆధారాలతో సహా బయటపెట్టినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించినట్లు ఏఎంఆర్ సంస్థకు కట్టబెట్టిన తాడిచర్ల బొగ్గు గనిలో జరిగిన రూ.20 వేల కోట్ల కుంభకోణంపై విచారణ జరిపించే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా, తాడిచర్లలో పర్ టన్ను రూ.560 కేటాయించాల్సి ఉండగా, రూ.3500 కు అలకేట్ చేసి ఏఎంఆర్ సంస్థకు దారాదత్తం చేశారని మండిపడ్డారు.
ఆరోపణలు చేసిన వివేక్ ఇప్పడు ఎందుకు మౌనంగా ఉన్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందంతో ఈ అక్రమాలను కప్పిపుచ్చుతున్నారని విమర్శలు చేశారు. వీకేఓసి కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి బంధువు కాదా? మీకు నచ్చిన వారికి 30 శాతం అధిక ధరలకు టెండర్లు ఇస్తున్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. సోలార్ ప్రాజెక్టుల విషయంలో దేశవ్యాప్తంగా మెగావాట్‌కు రూ.3.50 కోట్లు స్టాండర్డ్ రేట్ ఉంటే, 107 మెగావాట్ల ప్రాజెక్టుకు రూ.5.04 కోట్ల చొప్పున ఇచ్చి రూ.200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. డీజిల్, జెలటిన్ కొనుగోళ్లలో మార్కెట్ ధర కంటే 30 శాతం అదనంగా కొంటూ, డీజిల్‌ను ఐఓసి నుండి నేరుగా కాకుండా మధ్యవర్తుల ద్వారా కొంటూ సింగరేణికి నష్టం చేకూరుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించక పోవడంతో సింగరేణి పూర్తిగా అస్తవ్యస్తంగా మారి దివాలా తీసే పరిస్థితికి వచ్చిందని, ప్రతి నెల ఓవర్ డ్రాఫ్ట్ పైనే నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రూ.1600 కోట్ల విలువైన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైపోయిందని ప్రశ్నించినా ఇంతవరకు సమాధానం లేదన్నారు. గత 12 సంవత్సరాలుగా సింగరేణిలో జరిగిన అన్ని అవకతవకలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం హౌస్ కమిటీ వేస్తుందా? అఖిలపక్ష కమిటీ వేస్తుందా? లేక సీబీఐ విచారణకు లేఖ రాస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇస్తే సీబీఐ విచారణ జరిపించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సింగరేణి కాలరీస్ మైన్స్ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన బీజేపీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను పోలీసులు అమానుషంగా అడ్డుకోవడం తీవ్ర విచారకరమన్నారు.






