KTR : సీఎంకు ఎందుకింత అభద్రతా భావం : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-18 11:57:43  IST  )

మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం(KCR's Birthday) సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసిన ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడి(School Head Master)ని ప్రభుత్వం సస్పెండ్(Government Suspended) చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు.

KTR : సీఎంకు ఎందుకింత అభద్రతా భావం : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం(KCR's Birthday) సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసిన ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడి(School Head Master)ని ప్రభుత్వం సస్పెండ్(Government Suspended) చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. అత్యున్నత పదవిలో ఉండి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఎందుకింత అభద్రతాభావం(Insecure) అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా నిలదీశారు.

వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టొచ్చు..పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వొచ్చు..ఆయన కళ్యాణలక్ష్మి చెక్కులు పంచొచ్చు..అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయొచ్చని..ఆయనకు పాఠశాల విద్యార్థులను నడిఎండలో నిలబెట్టి పూలుచల్లి స్వాగతం పలకొచ్చని..వారితో ఆయనకు అధికార యంత్రాంగం దగ్గరుండి సెల్యూట్ కొట్టించవచ్చని ఏ అర్హత లేకున్నా అధికారిక వేదికపై కలెక్టర్ ను వెనక్కు నెట్టి వేదికను పంచుకోవచ్చంటూ ఆయా సంఘటనలను కేటీఆర్ ప్రస్తావించారు.

మంత్రి పొంగులేటి పుట్టినరోజున విద్యార్థులను ఎండలో నిలబెట్టి శుభాకాంక్షలు తెలియజేయవచ్చని..ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణికి ఎస్కార్ట్ సదుపాయం కల్పించవచ్చని గుర్తు చేశారు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, 14 ఏండ్లు అహింసాయుత పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, అస్థిత్వాన్ని చాటిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున విద్యార్థులకు మిఠాయిలు పంచితే తప్పా ? అని..కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు చేస్తే సరూర్ నగర్ పాఠశాల హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేస్తారా? అని కేటీఆర్ మండిపడ్డారు.

కేసీఆర్ పుట్టిన రోజున హైదరాబాద్ ఫ్లెక్సీలు కడితే చించేస్తారా ? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ లంటే గౌరవం లేదు..సహచర మంత్రుల మీద నమ్మకం లేదు..అత్యున్నత పదవిలో ఉండి ఇంత అభద్రతా భావమా మీకు..సిగ్గు సిగ్గు రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Next Story