- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బనకచర్లపై కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదు? : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
తెలంగాణ జలవనరులను తాకట్టు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ నేతలు..ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతున్నారని శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ జలవనరులను తాకట్టు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ నేతలు..ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతున్నారని శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా సెంటర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదు.? అని ప్రశ్నించారు. బనకచర్ల కు అవకాశం ఇచ్చిందే కేసీఆర్ అని, ఆనాడు కళ్లు మూసుకొని కూర్చున్నాడని విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం రెండుసార్లు జరిగితే కేసీఆర్ హాజరు కాలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్పాలనలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి హరీష్ రావు బనకచర్ల పై మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ మీ అయ్య జాగీరు అని కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఆనాడు ఒప్పుకున్నారా.? అని నిలదీశారు. తెలంగాణ మీ అయ్య జాగీరు అని రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేటీఆర్ మాట్లాడాడా..?అని ప్రశ్నించారు. రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని నోటికొచ్చినట్లు మాట్లాడలేదా? అన్నారు. కేసీఆర్ ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా మాట్లాడాడా లేక రాయలసీమ ముఖ్యమంత్రి అనుకున్నాడా..? అని ప్రశ్నించారు. జగన్ తో కేసీఆర్ ఎందుకు స్నేహం చేశాడు.. నాలుగు సార్లు ఎందుకు ప్రగతి భవన్ కు పిలిచాడో? చెప్పాలని డిమాండ్చేశారు. బేసిన్లు లేవు బేషజాలు లేవని కేసీఆర్ ఆనాడు ఇష్టానుసారంగా మాట్లాడలేదా?అని గుర్తుచేశారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీ ల వాటా కు కేసీఆర్ ఆనాడు ఎందుకు అంగీకరించారు?అని అద్దంకి దయాకర్ప్రశ్నించారు.
గోదావరిలో 3వేల టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని కేసీఆర్ కు ఎవరు చెప్పారు? అని పేర్కొన్నారు. తెలంగాణకు నష్టం జరిగితే మేం తప్పకుండా ప్రశ్నించి తీరుతామన్నారు. తెలంగాణ కు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాలపై చర్చించాలని తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కోట్లాడే దమ్ము తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందని, తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వమని ఈసందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్స్పష్టం చేశారు.
- Tags
- addanki dayakar






