- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఆదివాసీ దినోత్సవం'.. ఆగష్టు 9 నే ఎందుకు..?`
ప్రతిక్షణం అడవితో మమేకమై.. ప్రకృతిని ప్రేమిస్తూ, వన్యప్రాణులను లాలిస్తూ, అడవి తల్లి ఒడిలోనే ఒదిగిపోయే గిరిపుత్రులు ఈ 'ఆదివాసీలు'. పసి హృదయం లాంటి మనసు, ఎవరికీ హాని పెట్టని స్వభావం, కల్మషం లేని నవ్వు ఇవన్నీ వారికే సొంతం అనటంలో అతిశయోక్తి లేదు.

దిశ, వెబ్ డెస్క్: ప్రతిక్షణం అడవితో మమేకమై.. ప్రకృతిని ప్రేమిస్తూ, వన్యప్రాణులను లాలిస్తూ, అడవి తల్లి ఒడిలోనే ఒదిగిపోయే గిరిపుత్రులు ఈ 'ఆదివాసీలు'. పసి హృదయం లాంటి మనసు, ఎవరికీ హాని పెట్టని స్వభావం, కల్మషం లేని నవ్వు ఇవన్నీ వారికే సొంతం అనటంలో అతిశయోక్తి లేదు. నిత్యం అడవుల్లోనే జీవనం సాగించే ఈ గిరిపుత్రులు వారు ఉంటున్న ప్రాంతంలో ఏ మౌలిక సదుపాయాలు లేకున్నా.. ప్రకృతిలో లభించే అడవి తల్లి వనరులను వినియోగించుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తూ ఉంటారు. అయితే ఈ ఆధునిక ప్రపంచీకరణతో ప్రస్తుతం వారి సంస్కృతి దెబ్బ తింటుంది. దీనిపైన అవగాహన కల్పించేందుకు ఆగస్టు 9 న యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ (UNO) ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అయితే ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంతకీ.. ఆదివాసీ దినోత్సవం ఎప్పుడు మొదలైంది.?
గిరిజన దినోత్సవాన్ని1994 లో మొదటిసారిగా అమెరికాలో జరుపుకున్నారు. ఆ రోజు నుండి ప్రతి ఏటా ఆగస్టు 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీన్ని ఐక్య రాజ్య సమితి సాధారణ అసెంబ్లీ 1994 లో మొదటిసారిగా అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల సంవత్సరంగా ప్రకటించటం జరిగింది. డిసెంబర్ 23, 1994 లో 49/214 తీర్మానం ద్వారా, ప్రతి సంవత్సరం ఆగస్టు ని అంతర్జాతీయ దినంగా ప్రకటించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా ఆగస్టు 9, 1995 న జరుపుకున్నారు.
మరి ఆగస్టు 9 నే ఎందుకు.?
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవటంలో అమెరికాలోని గిరిజనులకు ముఖ్యమైన సహకారం ఉంది. అయితే కొలంబస్ దినోత్సవం అక్టోబర్ 12 న ప్రతి సంవత్సరం అమెరికాలోని దేశాలలో జరుపుకుంటారు. కొలంబస్ వలస పాలనా వ్యవస్థను ప్రోత్సహించిందని ఆదివాసులు బలంగా విశ్వసిస్తారు. అందుకే అప్పుడు పెద్ద ఎత్తున మారణహోమం జరిగిందని అక్కడి ఆదివాసీలు భావించారు. అందువల్ల అప్పుడు గిరిజనులు కొలంబస్ డే ను కాకుండా.. గిరిజన దినోత్సవాన్ని జరుపుకోవాలని డిమాండ్ చెయ్యటంతో 1977 లో జెనీవాలో అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా వారి వాదనను గట్టిగా వినిపించారు. తర్వాత జరిగిన పరిణామంలో గిరిజన దినోత్సవాన్ని జరుపుకోవాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఆ తర్వాత కూడా పోరాటం కొనసాగింది. తర్వాత ఆదివాసీ సంఘం 1989 నుండి అదే రోజున ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవటం ప్రారంభించింది. దీంతో వారికి మరింత ప్రజాదరణ పెరగటంతో.. ఐక్య రాజ్య సమితి ఆదివాసీ హక్కుల కోసం అంతర్జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. దీని తొలి సమావేశాన్ని 1982 ఆగస్టు 9 న జెనీవాలో జరిగింది. ఈ సమావేశం జ్ఞాపకార్ధం.. ఆగష్టు 9 వ తేదీని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించారు. ఇక అప్పటి నుండి ఆగస్టు 9 న ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.






