- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లన్నావు ఏమాయె.. చంద్రబాబుకు MLC అద్దంకి కౌంటర్
స్వాతంత్య్ర దినోత్స వేడుకల్లో బనకచర్లపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్‌లో కాకపుట్టిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బనకచర్లపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్‌లో కాకపుట్టిస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. మాట్లాడితే తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లని చెప్పే చంద్రబాబు.. తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరగుతుంటే ఎందుకు మాట్లాడరని కామెంట్ చేశారు. గోదావరి, కృష్ణా, పెన్నా జలాలు తీసుకెళ్లే హక్కు ఉందని మీరు పోరాడుతున్నప్పుడు.. కృష్ణా మీద మా వాటా గురించి మేం పోరాడితే.. అది వారికి వ్యతిరేకమనడం అవివేకమని అన్నారు. భవిష్యత్తులో కృష్ణా, గోదావరి జలాల వివాదం రాకూడదంటే మళ్లీ నీళ్ల పున: పంపకాలు జరగాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ దయాకర్ అన్నారు.
కాగా, విజయవాడ (Vijayawada)లోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తాము నిర్మించ తలపెట్టిన బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం ఉండబోదని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సముద్రంలోని వృథాగా పోయే నీటిని మాత్రమే వినయోగిస్తున్నామని అన్నారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో తాము నష్టాలను భరిస్తున్నామని కామెంట్ చేశారు. అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. వరదను భరించాలి కానీ.. ఆ నీటిని వాడుకొవొద్దా అని చంద్రబాబు అన్నారు.






