- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Disha Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?.. దిశ సర్వేలో కీలక విషయాలు
దిశ సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాలు (National politics) రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. మూడోసారి కేంద్రంలో ఎన్డీయే కూటమి (NDA government) అధికారం ఏర్పాటు చేసినా గతంలో పోలిస్తే విపక్షం బలపడటం మోడీ సర్కార్ కు సవాల్ గా మారింది. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్, ఓటు చోరీ వ్యవహారాలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చాలెంజ్ లు విసురుతున్నాయి.. జాతీయ రాజకీయాల్లో ఈ రెండు అంశాలిప్పుడు ప్రధానాంశాలుగా మారాయి. ఏ అంశాన్ని తీసుకున్న రెండు పాయింట్లతో ప్రతిపక్షం ఎన్డీయే కూటమిని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఓటర్లలో మూడ్ మారుతోంది. ఈ నేపథ్యంలో 'దిశ' దినపత్రిక (Disha media survey) సోషల్ మీడియాలో ఓ సర్వేను నిర్వహించింది. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందని అడుగగా మెజార్టీ నెటిజన్లు ఎన్డీయే కూటమికే జై కొట్టారు. తక్షణం దేశంలో ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి జయకేతనం ఎగురవేస్తుందని 66 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయగా, 34 శాతం మంది ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పారు. మోడీ చరిష్మాతో ఎన్డీయే నాలుగో సారి కూడా గెలవబోతుందని నెటిజన్లు కామెంట్ చేయగా, అధికార మార్పిడి అవసరం అని అందుకోసం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గెలవాలని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.
మళ్లీ సంకీర్ణ ప్రభుత్వమే:
ఇటీవల ఇండియా టుడే- సీ వోటర్ (India Today-CVoter survey) 'మూడ్ ఆఫ్ ద నేషన్' (Mood of the Nation)నిర్వహించిన సర్వే ఫలితాలు సైతం వెల్లడయ్యాయి. ఈ సర్వేలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 324 సీట్లు, ఇండియా కూటమికి (INDIA bloc) కేవలం 208 సీట్లు మాత్రమే వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. పార్టీల పరంగా పరిశీలిస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కేంద్రంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతున్నదని ఈ సర్వే తేల్చింది. పార్టీల పరంగా చూస్తే బీజేపీకి సొంతంగా 260 సీట్లు, కాంగ్రెస్ కు సొంతగా 97 సీట్లు వస్తాయని వెల్లడయింది. గత లోక్ సభ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతంతో పోలిస్తే ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎన్డీయే రెండు శాతం ఎక్కువ ఓట్లు దక్కించుకోబోతుందని తెలిపింది. 2024 ఎన్నికల్లో ఎన్డీయేకు 44 శాతం ఓట్లు లభించగా ఇప్పుడు 46.7 శాతం ఓట్లు లభిస్తాయని పేర్కొంది. ఇక గత లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 543 స్థానాలకు గాను బీజేపీ కేవలం 240 స్థానాలు కైవసం చేసుకుంది. ఇది అధికారం చేపట్టేందుకు అవసరమైన 272 సీట్ల కంటే 32 సీట్లు తక్కువ. దాంతో మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో మూడో సారి మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇక గత ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి మొత్తం 234 సీట్లు సాధిస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గతం కంటే తక్కువ సీట్లు వస్తాయని ఈ సర్వే స్పష్టం చేసింది.






