KTR : ముక్కు నేలకు రాయాల్సింది ఎవరో..? : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |

రైతురుణమాఫీ(Farmer Loan Waiver)అసంపూర్ణమన్న మా మాటలు మంత్రి దామోదర రాజనరసింహ(Minister Damodar Rajanarasimha)చేసిన వ్యాఖ్యలతో నిజమని తేలిపోయిందని ఇప్పుడు ముక్కు నేలకు రాయాల్సింది(Nose To The Ground)ఎవరో..పదవులకు రాజీనామా చేయాల్సింది ఎవరో.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.

KTR : ముక్కు నేలకు రాయాల్సింది ఎవరో..? : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : రైతురుణమాఫీ(Farmer Loan Waiver)అసంపూర్ణమన్న మా మాటలు మంత్రి దామోదర రాజనరసింహ(Minister Damodar Rajanarasimha)చేసిన వ్యాఖ్యలతో నిజమని తేలిపోయిందని ఇప్పుడు ముక్కు నేలకు రాయాల్సింది(Nose To The Ground)ఎవరో..పదవులకు రాజీనామా చేయాల్సింది ఎవరో.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.

సన్నాసులు ఎవరో..సమర్థులు ఎవరో..అబద్దాలు చెబుతున్నది ఎవరో.. నిజాలు మాట్లాడుతున్నది ఎవరో..మేము కాదు.. మీ మంత్రివర్గ సహచరుడే చెబుతున్నాడని కేటీఆర్ చురకలేశారు. రైతు రుణమాఫీపై నువ్వు చెప్పింది శుద్ధ అబద్దమని స్పష్టమైందని..మరి సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లిలో లేదా కొడంగల్ లో ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణలు చెప్తావా!? అని కేటీఆర్ ప్రశ్నించారు.

రైతు డిక్లరేషన్ ఓ బూటకం..సంపూర్ణ రైతు రుణమాఫీ పచ్చి అబద్దం..కాంగ్రెస్ పాలన తెలంగాణ రైతాంగానికి ముమ్మాటికీ శాపమని మరోసారి కేటీఆర్ పునరుద్ఘాటించారు.

Next Story