Ponnam Prabhakar : కరీంనగర్ ను లండన్, న్యూయార్క్ చేస్తామని కోతలు కోసింది ఎవరు? : పొన్నం ప్రభాకర్

by Muthe.Rajitha |

హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ (Jai Bapu Jai Bhim Jai Samvidhan) కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.

Ponnam Prabhakar : కరీంనగర్ ను లండన్, న్యూయార్క్ చేస్తామని కోతలు కోసింది ఎవరు? : పొన్నం ప్రభాకర్
X

దిశ, వెబ్ డెస్క్ : హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ (Jai Bapu Jai Bhim Jai Samvidhan) కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. మహాత్మా గాంధీ(Mahathma Gandhi), అంబేద్కర్(Ambedkar), రాజ్యాంగాన్ని గౌరవించుకుందామని.. ఈ మూడు సూత్రాల మీద దేశం మొత్తం మీద కార్యక్రమం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నేతలపై విరుచుకు పడ్డారు. "కేటీఆర్(KTR) కరీంనగర్ కి వచ్చి కరీంనగర్ ఉద్ధరించాం.. కరీంనగర్ మనకు జన్మనిచ్చింది అని చెప్పారు. 2004 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నినాదాన్ని కాపాడడానికి 2006 లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికారం మా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నప్పటికీ తెలంగాణ నినాదాన్ని బతికించడానికి అత్యదిక మెజారిటీ తో కేసీఆర్ ను గెలిపించారు. క్లాక్ టవర్ సాక్షిగా నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించిన పర్వాలేదు అన్నారు.

కేటీఆర్ ను సూటిగా పలు ప్రశ్నలు అడుగుతున్న.. మొత్తం మెడికల్ కాలేజీలు సిద్దిపేట ,జగిత్యాల ,గోదావరి ఖని అన్ని ప్రాంతాల్లో ఇచ్చే వరకు కరీంనగర్ కు ఎందుకు ఇవ్వలేదు.. ఎవరు అడ్డంపడ్డారు? అప్పర్ మానేరు పూర్తి కాకుండానే రంగ నాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ ఎందుకు పూర్తయ్యాయి...? కరీంనగర్ ప్రజలు రాజకీయ పునర్జన్మ ఇస్తే కరీంనగర్ రామగుండం రొడ్డును ఎందుకు 8 లైన్ల రొడ్డుగా మార్చలేదు..? శాతవాహన యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కాలేజి పెట్టాలని ఆనాడే మేం తీర్మానం చేసిన మీరు శాతవాహన యూనివర్సిటీ లో ఎందుకు ఇంజనీరింగ్ కాలేజి పెట్టలేదు ..? కరీంనగర్ లండన్ ,న్యూయార్క్ లాగ చేస్తామని ఎందుకు చేయలేదు..? పోలీసులు హరస్ చేస్తున్నారని అంటున్నారు.. గతంలో భూ ఆక్రమణ కేసులో ఎందుకు స్పందించలేదు..ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? 25 సంవత్సరాల పార్టీలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పకుండా విజయోత్సవాలు చేస్తారా? అని ప్రశ్నలు కురిపించారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు.. కర్రు కాల్చి వాతపేట్టారని, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అబద్దాలు ప్రచారం చేయడం మానేయాలని హితవు పలికారు.

Next Story