- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసలు ఈ సంజయ్ ఎవరు? : మరోసారి ఫైర్ అయిన జీవన్ రెడ్డి
‘‘ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీనో తెలియదు?.. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీనో నాకు తెలియదు?.. జగిత్యాలలో కలిసి పని చేయడానికి సంజయ్ ఎవరు?” అని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ‘‘ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీనో తెలియదు?.. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీనో నాకు తెలియదు?.. జగిత్యాలలో కలిసి పని చేయడానికి సంజయ్ ఎవరు?” అని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంజయ్ ఏ పార్టీనో స్పీకర్ ని అడిగితే తెలుస్తదన్నారు. తాను చాలా సీనియర్ నేతను అని, తనకు జగిత్యాల డెవలప్మెంట్ పై అవగాహన ఉందని పేర్కొన్నారు. జగిత్యాలలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని ఆహ్వానించామని, అభివృద్ధి కి నిధుల ఇస్తానని పొంగులేటి చెప్పారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కుల, జనగణన చేస్తామనటం హర్షించదగ్గ విషయమన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ కేంద్రానికి లెటర్ రాసేలా ఆర్.కృష్ణయ్య చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందన్నారు.
కులగణన చేయడంతో బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ ఆలోచన అని, ఆయన ఆలోచన ప్రకారం తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసి మండలిలో, అసెంబ్లీలో ఆమోదం పొంది గవర్నర్ తో స్క్రూట్ని కి ఆమోదం లభించిందన్నారు. లీగల్ గా ఉబ్బందులు కలగొద్దని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 9వ షెడ్యూల్ చేర్చితే బలహీన వర్గాల విద్యార్థులకు, ఉద్యోగులకు 42 శాతం రిజర్వేషన్లు లభిస్తాయన్నారు. ఓబీసీ ల రిజర్వేషన్లు కూడా రాష్ట్రాల కు అనుగుణంగా చేపట్టాలని ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
- Tags
- jeevan reddy






