- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిటీ పోలీస్ కమిషనర్ ఎవరు..? ప్రముఖంగా వినిపిస్తున్న ఓ ఐపీఎస్ పేరు..?
ఎన్నికల విధుల నుంచి హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడంతో ఆ స్థానంలో వచ్చే కొత్త అధికారి ఎవరనే చర్చ మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికల విధుల నుంచి హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడంతో ఆ స్థానంలో వచ్చే కొత్త అధికారి ఎవరనే చర్చ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పంపే మూడు పేర్లలో ఎవరిని ఖరారు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఢిల్లీ నుంచి క్లారిటీ రానున్నది. ఇప్పటివరకూ సీవీ ఆనంద్ చూసిన బాధ్యతలను అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఎన్నికల డ్యూటీలు అయిపోయేంత వరకు సీవీ ఆనంద్ సహా మిగిలిన ఐపీఎస్ అధికారులు, నాన్-కేడర్ ఎస్పీలకు ఎన్నికల సంఘం ఎలక్షన్ డ్యూటీల్లేని పోస్టులకు అనుమతిస్తుందా..? లేక పోలింగ్ పూర్తయ్యేంతవరకూ హెడ్ క్వార్టర్‌కు మాత్రమే పరిమితం చేసి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచుతుందా అనే చర్చలూ జరుగుతున్నాయి.
షెడ్యూలు విడుదలైన రెండు రోజుల్లోనే ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవడం పోలీసు డిపార్టుమెంట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకేసారి ముగ్గురు పోలీసు కమిషనర్లను మార్చడం డిపార్టుమెంటులోనే చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల విధుల్లో రిమార్కుతో తప్పుకోవాల్సి వచ్చినందున భవిష్యత్తులో సర్వీసు రికార్డుల్లోకి ఎక్కి పదోన్నతులు, కీలక పోస్టింగుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న అంశం కూడా అధికారుల స్థాయిలో గుసగుసల స్థాయిలో వినిపిస్తున్నది.






