- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరి అబద్ధం చెబుతోంది ఎవరు..? హరీశ్‌రావు సెన్సేషనల్ ట్వీట్
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా యూరియా కొరత అన్నదాతలను వేధిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) వ్యాప్తంగా యూరియా కొరత అన్నదాతలను వేధిస్తోంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తన్న వేళ వ్యవసాయ పనులను సైతం పక్కన పెట్టి రైతులు పీఏసీఎస్‌ల ఎదుట యూరియా కోసం కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఎలాంటి ఎరువుల కొరత లేదంటూ కేంద్ర ప్రభుత్వం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అదేవిధంగా భారతదేశం యొక్క దీర్ఘకాలిక ఎరువుల అవసరాలను తీర్చేందుకు, రాష్ట్రాలకు సకాలంలో సరఫరా చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాలు జరుగుతున్నాయని తెలిపారు. 2025 ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు రాష్ట్రాలలో ఎరువుల లభ్యత సౌకర్యవంతంగా ఉందని కేంద్రం తెలిపింది. యూరియా యొక్క ప్రో-రేటా అవసరం 143 ఎల్‌ఎమ్‌టీకి వ్యతిరేకంగా మొత్తం లభ్యత 183 ఎల్‌ఎమ్‌టీగా ఉందని, అందులో 155 ఎల్‌ఎమ్‌టీ అమ్మకాలు జరిగాయని స్పష్టం చేసింది. అదేవిధంగా, డీఏపీలో 45 ఎల్‌ఎమ్‌టీ ప్రో-రేటా అవసరానికి వ్యతిరేకంగా 49 ఎల్‌ఎమ్‌టీ లభ్యత ఉందని, 33 ఎల్‌ఎమ్‌టీ అమ్మకాలు జరిగాయని స్పష్టం చేసింది. ఎన్‌పీకేలలో 58 ఎల్‌ఎమ్‌టీ ప్రో-రేటా అవసరానికి వ్యతిరేకంగా 97 ఎల్‌ఎమ్‌టీ లభ్యత ఉందని.. ఇప్పటి వరకు 64.5 ఎల్‌ఎమ్‌టీ ఎన్‌పీకేల అమ్మకాలు జరిగాయని తేల్చి చెప్పింది.
అయితే, తాజాగా ఆ ప్రకటనపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. రాష్ట్రంలో యూరియా కొతరకు కారణం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వమా.. లేక ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) నేతృత్వంలోని భారత ప్రభుత్వ రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖనా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన ప్రకటన బట్టి ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎరువుల లభ్యత సౌకర్యవంతంగా ఉందని తెలస్తోందన్నారు. కానీ, 2025 ఆగస్టు 20 నాటికి, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే యూరియా అమ్మకాలు 13 ఎల్‌ఎమ్‌టీకి పైగా పెరిగాయని అన్నారు. ఈ అమ్మకాల పెరుగుదల ఉన్నప్పటికీ, ఎరువుల శాఖ దేశ వ్యాప్తంగా యూరియా నిరంతర లభ్యతను స్థానిక ఉత్పత్తిని పెంచడం, ప్రపంచ టెండర్ల ద్వారా సేకరిస్తామని కేంద్ర స్పష్టం చేసిందని అన్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాను సకాలంలో సేకరించడంలో విఫలమైందా.. లేక ఎన్‌డీఏ ప్రభుత్వం (NDA Government) అబద్ధం చెబుతోందా..? కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా నిజమైతే, తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచడంలో పూర్తిగా విఫలమైనట్లేనని హరీశ్ రావు ట్వీట్ చేశారు.






