Congress: కవిత కౌన్ కిస్కా హై..? మా పనికి ఆమె క్రెడిట్ తీసుకోవడమేంటి: మహేశ్ కుమార్ గౌడ్

by Prasad Jukanti |

బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎమ్మెల్సీ కవిత పై టీపీసీసీ చీఫ్ విమర్శలు గుప్పించారు.

Congress: కవిత కౌన్ కిస్కా హై..? మా పనికి ఆమె క్రెడిట్ తీసుకోవడమేంటి: మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేసేందుకు కేబినెట్ తీసుకోవడం స్వాగతించ తగ్గ విషయం అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అని ఈ నిర్ణయం వెనుక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆశయం ఉందన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సామాజిక న్యాయం కాంగ్రెస్ తో నే సాధ్యం అని మరోసారి నిరూపిపతమైందని బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇది బీసీలకు ఓ సువర్ణావకాశం అని దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

బీసీ రిజర్వేషన్లను 21 శాతానికి తగ్గించిన గత పాలకులు ఇవాళ మేమేదో ఘన కార్యం చేసినట్లు చెప్పుకుంటున్నారని అలాంటి నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. మేము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దానికి ఆమె క్రెడిట్ తీసుకోవడం ఏంటని మండిపడ్డారు. 'కవిత కౌన్ కిస్కా హై..' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పదేళ్లు ఏం వెలగబెట్టారని కవిత బీసీ పాట పాడుతున్నారు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ గాంధీ అజెండా, రేవంత్ రెడ్డి నిబద్ధతో సాధ్యమైందన్నారు. కవిత మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. అధికారంలో ఉండగా ఒక్కరోజు బీసీల గురించి మాట్లాడని మీకు అధికారం పోగానే బీసీలు గుర్తుకు వచ్చారా? అడుగడుగునా బీసీలను అణగదొక్కిన బీఆర్ఎస్ అధినేత కూతురు మీరు అని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడమేనని ఇందులో బీఆర్ఎస్, బీజేపీలకు ఎలాంటి భాగస్వామ్యం లేదన్నారు.

Next Story