- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవుడి పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారు.. TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాల్లో అసలు దేవుడి పేరును వాడుకునే హక్కు బీజేపీ (BJP)కి ఎవరిచ్చారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో అసలు దేవుడి పేరును వాడుకునే హక్కు బీజేపీ (BJP)కి ఎవరిచ్చారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన గాంధీభవన్ (Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి పక్కా ప్రణాళికలతో మున్సిపల్ ఎన్నికల్లో రంగంలోకి దిగుతామని అన్నారు. సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళతామని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా చెప్పుకుంటూపోతే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో విద్య, వైద్యం, స్పోర్ట్స్‌కి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్ మూలంగానే కొన్ని స్థానాలు కోల్పోయామని.. తద్వారా బీఆర్ఎస్ పార్టీ కొంత లబ్ధి పొందిందని అన్నారు. ఇటీవల మీడియాలో వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వార్త కథనాలు రావడాన్ని తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. వాస్తవానికి దూరంగా వార్త కథనాలు ప్రసారం శ్రేయస్కరం కాదని ఆక్షేపించారు.
కేటీఆర్‌కు సిస్టర్ స్ట్రోక్.. బావకు మరదలి స్ట్రోక్
శాసనమండలి సాక్షిగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంధించిన ప్రశ్నలకు కేటీఆర్‌కు సిస్టర్ స్ట్రోక్, హరీశ్‌రావుకు మరదలి స్ట్రోక్ తగిలిందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పదేళ్ల ప్రభుత్వంలో అవినీతి, పార్టీ పేరు మార్పుపై ప్రశ్నలకు ఆ ఇద్దరి దగ్గర సమాధానలు లేవన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 70 శాతం పైగా స్థానాలను గెలుచుకున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో 25 వేలకు పైగా మెజార్టీతో గెలిచామని.. ఆ ఫలితాలే కాంగ్రెస్ ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిదర్శనమని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 90శాతం పైగా స్థానాలు కైవసం చేసుకుంటామని తెలిపారు. బీజేపీ నేతలు జిల్లా పేరు మార్పు సంగతి పక్కన పెట్టి.. వారు చేసిన అభివృద్ది పనుల గురించి మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు. అసలు రాజకీయాల్లో దేవుడి పేరు వాడుకునేందుకు వారికి అధికారం ఎవరిచ్చారో చెప్పాలన్నారు. నిరుద్యోగుల ఉసురు తగిలే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని కామెంట్ చేశారు. హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా భూములు అమ్మిన ఘనత బీఆర్‌ఎస్ సర్కారుదేనని.. అసలు రియల్టర్ కేటీఆరే అని టీపీసీసీ చీఫ్ కామెంట్ చేశారు.






