ఎవరికి వారు దోచుకుతింటుండ్రు.. మంత్రులపై మాజీ మంత్రి ఎర్రబెల్లి ఫైర్

by Kema Shiva Kumar |

క్వారీ యజమానిని బెదిరించిన కేసులో హుజూరాబాద్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి (Padi Kaushik Reddy) ఇవాళ ఉదయం పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఎవరికి వారు దోచుకుతింటుండ్రు.. మంత్రులపై మాజీ మంత్రి ఎర్రబెల్లి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: క్వారీ యజమానిని బెదిరించిన కేసులో హుజూరాబాద్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి (Padi Kaushik Reddy) ఇవాళ ఉదయం పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను వరంగల్‌ (Warangal)లోని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎంజీఎం (MGM)లో వైద్య పరీక్షల అనంతరం కౌశిక్ రెడ్డిని కాసేపట్లో వరంగల్‌ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే, కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సుబేదారి పోలీసు స్టేషన్‌ వద్ద బీఆర్ఎస్ (BRS) శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కౌశిక్‌రెడ్డిని కలిసేందుకు వినయ్‌భాస్కర్‌, ఇతర నేతలు యత్నించగా.. వారిని పోలీసులు స్టేషన్‌ లోపలికి వెళ్లకుండా అడ్డకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే అరెస్ట్ అయిన కౌశిక్ రెడ్డిని మాజీ మంత్రి, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ (Errabelli Dayakar Rao) సుబేదారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రతికార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థత, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు అన్యాయంగా కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలన అట్టర్‌ ఫ్లాప్ అయిందని, ఆయనకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని కామెంట్ చేశారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా రేవంత్ కంట్రోల్‌లో లేరని అన్నారు. ముఖ్యంగా మంత్రులు ఎవరికి వారు దోచుకు తింటుండ్రని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.

Next Story