- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే రైతులే మరమ్మత్తులకు తీసుకెళ్తున్నారు: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం శాసనమండలి వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో రైతులు (farmers Problems) ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (CPI MLC Nellikanti Satyam) శాసనమండలి వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే ప్రభుత్వమే ఉచితంగా మారుస్తుందన్నది అవాస్తవమని, రైతులే సొంత డబ్బులు వెచ్చించి వాటిని మరమ్మత్తులకు తరలిస్తున్నారని ఆయన మండలిలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో మూడు డీడీలు కడితే ఏడు విద్యుత్ స్తంభాలు మంజూరయ్యేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం ఒకటే ఇస్తున్నారని, మిగిలిన స్తంభాలను రైతులు బయట కొనుక్కోవాల్సి వస్తోందని సభ దృష్టికి తీసుకొచ్చారు.
కాగా ఎమ్మెల్సీ సత్యం చేసిన ఈ వ్యాఖ్యలను శాసన మండలి చైర్మన్ (Chairman of the Legislative Council) గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) సమర్థించారు. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తులకు రైతులు డబ్బులు ఖర్చు చేస్తున్నారన్నది ముమ్మాటికీ నిజమేనని, దానికి తానే ప్రత్యక్ష సాక్ష్యమని చైర్మన్ ఒప్పుకున్నారు. సభలో విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అంతా సవ్యంగానే ఉందని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉందని, బయట పనులు సాఫీగా జరగడం లేదని చైర్మన్ స్వయంగా వ్యాఖ్యానించడం అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టింది.






