- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jubilee Hills: మా స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో దానం పేరుంటే తప్పేంటి?: మహేశ్ కుమార్ గౌడ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దానం నాగేందర్ అంశంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills by-election) కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా (Congress star campaigners list) హాట్ టాపిక్ గా మారింది. ఈ జాబితాలో దానం నాగేందర్ (Danam Nagender) పేరు ఉండటంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. మా పార్టీ నుంచి గెలిపిన ఎమ్మెల్యే పేరును మీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పెట్టుకోవడం ఏంటని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. దానం నాగేందర్ తమకు బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారని అలాంటి దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో ఉంటే తప్పేంటని అన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. దానం నాగేందర్ మాకు మద్దతు ఇచ్చినంత మాత్రాన కాంగ్రెస్‍లో చేరినట్లు కాదన్నారు. పార్టీలో చేరడానికి మద్దతు ఇవ్వడానికి చాలా తేడా ఉందన్నారు.
జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం మాకు సహకరించే వారందరి మద్దతు తీసుకుంటున్నామని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల అంశంలో విషయంలో దానం నాగేందర్ విషయం స్పీకర్ పరిధిలో ఉందని ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అలా ముందుకు వెళ్తామన్నారు. దీన్ని రాద్ధాంతం చేయడం ఏంటో అన్నారు. ఫిరాయింపులకు ఆధ్యుడు కేసీఆర్ అని కరప్షన్ కు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబం అని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి తోడూ యువకుడైన నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం జూబ్లీహిల్స్ లో మాకు మంచి గెలుపు ఇవ్వబోతోందన్నారు. కొండా సుస్మిత అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, ఆమె వ్యాఖ్యలపై కొండా దంపతులు విచారం వ్యక్తం చేశారని చెప్పారు. జీవన్ రెడ్డి చాలా రోజుల నుంచి అసంతృప్తిలో ఉన్నారని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నివేదిక రాగానే ఆ ఇష్యూను సెట్ చేస్తామన్నారు.






