- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్స్ట్ ఏంటి..! సిట్ సభ్యులతో సజ్జనార్ భేటీ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే పలువురు అధికారులను ప్రశ్నించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఇప్పుడు తుది అడుగులు వేస్తోంది. డిసెంబర్ నుంచి సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తును నెల రోజుల్లో పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లుగా సమాచారం.
దర్యాప్తు పురోగతిని సమీక్షించేందుకు సిట్ చీఫ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్.. సిట్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు సేకరించిన ఎలక్ట్రానిక్ ఆధారాలు, కాల్ డేటా రికార్డులు (CDR), సర్వర్ లాగ్‌లు, సీజ్ చేసిన పరికరాల ఫోరెన్సిక్ నివేదికలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిసింది. ఇంకా పెండింగ్‌లో ఉన్న సాక్ష్యాల సేకరణ, కీలక వ్యక్తుల స్టేట్‌మెంట్‌ల రికార్డింగ్‌ను వేగవంతం చేయాలని సూచనలు ఇచ్చారు.
కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు అధికారుల పాత్రపై స్పష్టతకు రావడమే కాకుండా, ఆ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై కూడా సిట్ దృష్టి సారించింది. చార్జ్‌షీట్ దాఖలు, డిపార్ట్‌మెంటల్ చర్యలు, సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసుల కొనసాగింపు వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. దర్యాప్తు గడువును కట్టుదిట్టంగా పాటించాలని, ఎటువంటి లోపాలు లేకుండా తుది నివేదిక సిద్ధం చేయాలని సిట్ చీఫ్ సూచించారు.ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కేసు తుది దశకు చేరుతుండటంతో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని భావిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై సీపీ చర్చించినట్లు తెలుస్తోంది.
కేసులో ఎరేజ్ చేసిన డేటా, ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌ల నుండి ఎంతవరకు సమాచారాన్ని సేకరించగలిగారు? ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు ఏం చెబుతున్నాయి? ఇప్పటికే అరెస్టయిన పోలీస్ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని ఇతర సాక్ష్యాలతో సరిపోల్చనున్నారు. ఈ వ్యవహారంలో తెర వెనుక ఉన్న రాజకీయ నాయకులు లేదా మరికొందరు ఉన్నతాధికారుల పాత్రపై ఉన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కేసును నీరుగారిపోకుండా చూడటానికి సిట్ అధికారులు టెక్నికల్ ఎవిడెన్స్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కాల్ డేటా రికార్డులు, ఐపీ (IP) లాగ్స్‌ను విశ్లేషించడం ద్వారా.. ఎవరెవరు, ఎక్కడ ఉండి ఈ పనులకు పాల్పడ్డారనేది శాస్త్రీయ (Scientific) పద్ధతిలో నిరూపించాలని చూస్తున్నారు.






