RS Praveen Kumar : వాళ్ళు ఏం పాపం చేశారు? : ప్రభుత్వంపై ఆర్ఎస్పీ ఫైర్

by Muthe.Rajitha |

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ఫైర్ అయ్యారు.

RS Praveen Kumar : వాళ్ళు ఏం పాపం చేశారు? : ప్రభుత్వంపై ఆర్ఎస్పీ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ఫైర్ అయ్యారు. క్రిస్మస్(Christamas) వేడుక‌ల‌కు గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు సెలవులు ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఘనంగా క్రిస్మస్ వేడుకలు చేస్తుంది కాని ఆ విద్యార్థులు ఏం పాపం చేశారని పండగ పూట కూడా కుటుంబం మధ్య లేకుండా హాస్టల్ లోనే ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నీ 3 రోజుల పాటు సెలవులు ప్రకటించాయని, వీరికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సెలవులు ప్రకటించలేదని దుయ్యబట్టారు. అందరి పిల్లల లాగా వీళ్లకు కూడా పండగ పూట వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి సరదాగా గడిపే అవకాశం ఉండాలె కదా? మీ రాహుల్ గాంధీ చెప్తున్న లౌకితత్వం అంతా ఉట్టిదేనా? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం ఇచ్చిన విధంగానే ఈ ఏడాది కూడా 3 రోజులు క్రిస్మస్‌ సెలవులివ్వాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీకి చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఏడాది సెలవులను ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని సొసైటీలో ప్రతి సంవత్సరం 24,25,26న సెలవులు ఇచ్చేవారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేయలేదు. విద్యార్థులను ఇళ్లకు పంపకపోవడంతో ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగుతున్నారు. తమకు అతిపెద్ద పండుగ క్రిస్మస్‌ అని, దానికి కూడా విద్యార్థులను పంపకపోతే ఎలా అని మండిపడుతున్నారు.

Next Story