హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏం పాపం చేసింది.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-01 03:20:45  IST  )

వరుస అగ్ని ప్రమాదాలు ఓల్డ్ సిటీ (Old City) ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏం పాపం చేసింది.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస అగ్ని ప్రమాదాలు ఓల్డ్ సిటీ (Old City) ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అక్కడి ప్రజలకు సరైన అవాసాలు లేక ఇబ్బందులపాలు అవుతున్నారు. పారిశుధ్య నిర్వహణ సరిగా లేక రోజురోజుకు పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి. మరోవైపు ఇరుకైన రహదారులు, హెవీ ట్రాఫిక్‌ (Heavy Traffic)తో వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలోనే ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఓల్డ్ సిటీ అభివృద్ధిపై ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ (Hyderabad)లోని పాతబస్తీ ఏం పాపం చేసిందని కామెంట్ చేశారు. హెవీ ట్రాఫిక్ ఉన్నప్పటికీ పోలీసులు ఉన్నతాధికారులు పనిచేయని సిగ్నల్ లైట్లను పట్టించుకున్న పాపాన పోవట్లేదని అన్నారు. రోడ్ల వెంట చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారిని ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వ్యాపారాలపై లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ ఉపాధి ఇలానే కోల్పోతే దోపిడీలు, దొంగతనాలు పెరిగిపోయే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే స్పందించి ఓ నిర్ణయం తీసుకోవాలని అసదుద్దీన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Next Story