- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TPCC Chief : మీరు దేశం కోసం ఏం త్యాగం చేశారు..? : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ప్రపంచం మెచ్చిన భారత రాజ్యాంగాన్ని(Constitution of India) మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని టీ.పీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud) ఆరోపించారు

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచం మెచ్చిన భారత రాజ్యాంగాన్ని(Constitution of India) మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని టీ.పీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud) ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలలో జాతీయ పతాకాన్ని మహేశ్ కుమార్ గౌడ్ ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని..తద్వారా కాషాయ ఎజెండాను అమలు చేయాలని బీజేపీ(BJP) పాలకులు చూస్తున్నారన్నారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ను కేంద్ర హోం మంత్రి అవమానించారని, ప్రధాని మోడీ వంత పాడారని విమర్శించారు.
దేశం కోసం మాజీ ప్రధాని నెహ్రూ దేశం కోసం ఏండ్ల తరబడిగా జైలు జీవితం గడిపారని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానమయ్యారన్నారు. దేశం కోసం ప్రధాని మోడీ ఏ త్యాగం చేశారని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టవద్ధంటూ మాజీ ప్రధాని ఇందిరమ్మ ను అవమానించేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారని విమర్శించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగశీలి ఇందిరమ్మ అని, మీరు దేశం కోసం ఏం త్యాగం చేశారంటూ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. దేశ సమగ్రత, పేదల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.






