- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవుని ఉనికిని తిరస్కరించే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకన్నా ఏమి ఆశించగలం: కేంద్ర మంత్రి బండి సంజయ్
కాంగ్రెస్ ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Congress chief Mahesh Kumar Goud) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ (Hot topic)గా మారాయి. ఆదివారం ఆయన మాట్లాడుతూ,, తెలంగాణలో దొంగ ఓట్లు ఉన్నాయని, ఆ దొంగ ఓట్లతోనే బీజేపీ 8 ఎంపీలను గెలించిందని తీవ్ర ఆరోపణలు చేశాడు. అలాగే దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ కూడా ఎంపీగా గెలిచేవాడు కాదని, బీజేపీ రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడిగిందని, ఎన్నికల సమయంలో మాత్రమే బీజేపీకి రాముడు గుర్తుకు వస్తాడని ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ఎక్స్ వేదికగా స్పందించాడు. ఆయన తన ట్వీట్‌లో "నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిగ్గులేకుండా రాముడిని బీజేపీ పార్టీ సభ్యుడిగా చూస్తూ ఎగతాళి చేస్తుంది. దేవుని ఉనికినే తిరస్కరించే పార్టీ దాని బుద్ధిహీన నాయకుల నుండి మనం ఇంకా ఏమి ఆశించగలం? 2007లో రామసేతు కేసులో అఫిడవిట్ దాఖలు చేస్తూ రాముడిని కోర్టులోకి లాగింది కాంగ్రెస్ పార్టీ.
ఆ సమయంలో “రాముడు లేడు, రామాయణం లేదు” – కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) సుప్రీంకోర్టుకు చెప్పింది. దశాబ్దాలుగా, కాంగ్రెస్ రామమందిర ద్వారాలకు తాళం వేసింది. కానీ బీజేపీ ప్రభుత్వం (BJP Govt) మాత్రం వాటిని తెరిచిందని గుర్తు చేశారు. అలాగే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మరింత ముందుకు వెళ్లి - మందిర్ ఉద్యమాన్ని 'ఓడించారని', హిందువులను 'హింసాత్మకులు' అనే ముద్ర వేశారని, కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కు హాజరు కావడానికి కూడా నిరాకరించిందని ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు. భారత ప్రజల విశ్వాసాన్ని అపహాస్యం చేయడం కాంగ్రెస్ DNAలో ఉందని, శ్రీ రాముడు భారత్ DNAలో ఉన్నాడని, బీజేపీ ఎప్పుడు ఆ శ్రీ రాముడిని గౌరవిస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం రాముడిని ఎగతాళి చేస్తుందని బండి సంజయ్ అన్నారు.
Read More: దమ్ముంటే దొంగ ఓట్లను బయటకు తీయాలి.. కాంగ్రెస్‌కు ఎంపీ డీకే అరుణ సవాల్






