- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనాపాటి.. గరికిపాటి ఏంటయ్యా ఇది?.. ‘స్త్రీ సైకో అంటూ ఫస్ట్ వైఫ్ సంచలన ఆరోపణలు (వీడియో)
గరికిపాటి నరసింహా రావు.. ప్రవచనకర్తగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు.

దిశ, వెబ్‌డెస్క్: గరికిపాటి నరసింహా రావు.. ప్రవచనకర్తగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వ్యంగ్యాస్త్రాలతో ప్రవచనాలు చెప్పే గరికిపాటికి ఓ సపరేటు ఫ్యాన్ బేస్ ఉంది. అధ్యాత్మిక విషయం అటుంచితే.. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు విమర్శలకు దారితీస్తున్నాయి. ప్రవచాలు బోధించే ఆయనపై మొదటి భార్య కామెశ్వరి మరోసారి సంచలన విషయాలను బయటపెడుతూ తాజాగా సోషల్ మీడియాలో సంచలన వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో కామెశ్వరి మాట్లాడుతూ.. మాజీ భర్త గరికిపాటిపై తాను చేస్తున్న ఆరోపణలపై ప్రజల ముందుకు వచ్చి మాట్లాడలేరని కామెంట్ చేశారు. పెళ్లి చేసుకున్న నాటి నుంచి తనకు ఘోరాతిఘోరమైన పరిస్థితిని కల్పించి నలిపేశాడని అతడో ‘స్త్రీ సైకో’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు సరస్వతి పుత్రుడిగా కనబడే గరికిపాటిపై లోపల నీచాతి నీచమైన భావనలు ఉన్నాయని తెలిపారు. 40 ఏళ్ల క్రితం తప్పు చేసినా.. ఇప్పుడు అలాంటి వెర్రి పనులు చేయకపోయినా.. స్త్రీ పట్ల అతడికి ఉన్న చులకన భావం మారలేదని అన్నారు. గరికిపాటి చేసిన పనులు ప్రపంచానికి చెప్పేవి కావని కామెంట్ చేశారు. భర్త ఎలాంటి వాడో జన్మనిచ్చిన తల్లికి తెలియదని.. భార్యకు మాత్రమే తెలుస్తోందిని కామేశ్వరి ఆరోపించారు.
ఆ దుష్టుడి వల్ల అన్నింటికీ దూరమయ్యా..
వరంగల్ జిల్లా, నర్సంపేట తాలూక ఖానాపురంలో గరికిపాటి, తన స్నేహితుడితో కలిసి నేతాజీ గురుకుల విశ్వవిద్యాలయం పేరుతో పాఠశాల పెట్టాడని కామేశ్వరి తెలిపారు. ఆయన అన్నతో తనకు పెళ్లైందని.. దగాచేసి తనను తన దానిని చేసుకున్నాడని ఆరోపించారు. పెళ్లైన మూడో రోజు నుంచే కుటుంబ వివాదాల వల్ల పుట్టింటికి కూడా వెళ్లనివ్వలేదని కన్నీరు పెట్టారు. తనకు పూజలు, పునస్కారాలు, వ్రతాలు అంటే చాలా ఇష్టమని దుష్టుడు గరికపాటి నరసింహా రావు వల్ల అన్నింటికి దూరయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి తనను వదిలించుకునేందుకు తల్లి, కొడుకు కలిసి చేతబడి ప్రయోగం చేయించారని ఆరోపించారు. భర్త నుంచి విడిపోయినా.. తనకు భగవంతుడి కృప ఉందని.. ఇళ్లు, బ్రతకడానికి ఓ ఉద్యోగం ఇచ్చాడని కామెంట్ చేశారు. తాను చచ్చిపోతే ఇదే గరికిపాటి గంధపు చెక్కలతో కాలుస్తాను అని అన్నాడని సంచలన వ్యాఖ్యల చేశారు. ఆ క్షణానే తాను ఇల్లు వదిలి వెళ్లిపోదామనుకున్నానని.. కానీ ఇద్దరు పిల్లల మొహాలు చూసి ఆగాల్సి వచ్చిందని కామెశ్వరి చెప్పకొచ్చారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://x.com/UttarandhraNow/status/1955112734883983383






