Boreddy Vs KTR : కేటీఆర్ ఆస్తుల పెరుగుదల మతలబు ఏమిటో : బోరెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-02-14 13:47:24.0  )
Boreddy Vs KTR : కేటీఆర్ ఆస్తుల పెరుగుదల మతలబు ఏమిటో : బోరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: మీ ఆస్తులు అంతకంతకు పెరగడం(Increase Assets) వెనుక మతలబు ఏమిటంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ను సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ పీఆర్వో, కాంగ్రెస్ నేత బోరెడ్డి అయోధ్యరెడ్డి(Boreddy Ayodhya Reddy)ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. 2009లో మీ ఆస్తులు 4.35 కోట్లుగా ఉంటే..2023లో మీ ఆస్తులు 53.31 కోట్లకు పెరిగాయని బోరెడ్డి గుర్తు చేశారు. మీ ఆస్తులు ఇంత ఘనంగా పెరగడానికి ఇలాంటి వ్యాపారాలేనా? ఇంకా ఏమైనా బయటకు రావాలిసినవి ఉన్నయా అని కేటీఆర్ ను ప్రశ్నించిన బోరెడ్డి హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫాం హౌస్‌లో కోడి పందేలు, భారీగా నగదు పట్టివేత ఘటనను ప్రస్తావించారు.

ఫామ్ హౌస్ లో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లను అధికారులు సీజ్ చేశారని..86 పందెం కోళ్ళు.. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్సు స్వాధీనం చేసుకున్నారని. పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారని బోరెడ్డి పేర్కొన్నారు. ఈ రకమైన వ్యాపారాలతోనే మీ ఆస్తులు పెంచుకున్నారా అంటూ కేటీఆర్ ను బోరెడ్డి ప్రశ్నించారు. భీమవరం నుంచి బోస్టన్ దాకా స్పందించే మీరు... దీనిపై కూడా స్పందిస్తారని ఆశిస్తున్నానని బోరెడ్డి వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

Advertisement
Next Story