ఇప్పుడు జరుగుతున్నది సిద్దాంతపరమైన యుద్దం.. బీజేపీ ఎంపీ కొండా సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |

బీజేపీ పార్టీతో పోరాడేందుకు మూడు పార్టీలు కుమక్కు అయ్యాయని, ఈ ఎన్నికల్లో జరిగేది సిద్దాంతపరమైన యుద్దమని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (BJP MP Konda Vishweshwar Reddy) అన్నారు.

ఇప్పుడు జరుగుతున్నది సిద్దాంతపరమైన యుద్దం.. బీజేపీ ఎంపీ కొండా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ పార్టీతో పోరాడేందుకు మూడు పార్టీలు కుమక్కు అయ్యాయని, ఈ ఎన్నికల్లో జరిగేది సిద్దాంతపరమైన యుద్దమని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (BJP MP Konda Vishweshwar Reddy) అన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల (Hyderabad MLC Elections)పై మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రత్యర్థి పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ (BJP Party)తో పోటీ పడేందుకు ఎంఐఎం(MIM), కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) పార్టీలు కుమ్మక్కు అయ్యాయని వ్యాఖ్యానించారు.

అసలు ఎంఐఎం పార్టీకి సెక్యూలర్, అంబేద్కర్ (Ambedkar) అనే పదాలు వాడే హక్కుందా అని ప్రశ్నించారు. అలాగే యాంటీ సెక్యూలర్ పార్టీ (Anty Secular Party) అయిన ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం కరెక్టేనా అని, ఎంఐఎంకు మద్దతు ఇస్తున్న టీఆర్ఎస్/బీఆర్ఎస్ పార్టీ వాళ్లు సెక్యూలర్ అనే పదం వాడే హక్కుందా అని నిలదీశారు. అసదుద్దీన్ (Asduddin) కు లొంగిపోయి, ఎంఐఎం కు మద్దతు ఇచ్చేందుకేనా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో నిలబడటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం లేకుంటే బ్రతకలేదని అందుకే వారికి లొంగిపోయారని అన్నారు.

ఒక మతం కాదు.. దేశం గురించి ఆలోచించడమే సెక్యూలర్ భావజాలం అని అంబేద్కర్ చెప్పారని, ఎంఐఎం కు మద్దతు ఇస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు సెక్యూలర్ అనే పదం వాడే హక్కు లేదని అన్నారు. శనివారం జరిగిన ఓ మీటింగ్ లో ఎంఐఎం నేత అసదుద్దీన్ మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కేసీఆర్ తో పొత్తు ఉండి ఆయన కూడా అదే భాష వాడుతున్నారని చెప్పారు. ఆయన ఏం భాష మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని, ఆయన చదువుకున్న చదువు ఇదేనా అని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం బీజేపీ చేస్తున్న కార్యక్రమాలు అన్నింటికీ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు.

ఇక బీఆర్ఎస్ వాళ్లని ఎన్నికల్లో ఓటు వేయొద్దని పార్టీ పెద్దలు చెబుతున్నారని, వాళ్లు ఇంట్లో కూర్చొని ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. చదువుకున్న వాళ్లంతా ఓటు వేసే ముందు ఆలోచించాలని, నిజంగా సెక్యూలర్ భావజాలం ఉంటే, దేశ భక్తి ఉంటే, భారతీయులు అందరూ ఒక్కటే అనుకుంటే ఆత్మ పరిశీలన చేసుకొని ఓటు వేయాలని సూచించారు. అలా ఓటు వేస్తే బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు కచ్చితంగా గెలుస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో జరిగేది సిద్దాంతపరమైన యుద్దమని, ఒక మతతత్వ పార్టీకి, సెక్యూలర్ పార్టీకి జరుగుతున్న యుద్దమని, అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ అన్నారు.

Next Story