- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో బిహార్ సంస్కృతి ఏంటి.. బీఆర్ఎస్‌పై ఎంపీ చామల ఫైర్
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీ బిహార్ సంస్కృతి తరహా దాడులకు తెరలేపుతోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీ బిహార్ సంస్కృతి తరహా దాడులకు తెరలేపుతోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) ఫైర్ అయ్యారు. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై దాడులు చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదిక ఓ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసేందుకు గులాబీ పార్టీ ప్రయత్నం చేస్తోందని అన్నారు. తెలంగాణ (Telangana) అంటే బీఆర్ఎస్ అనే విధంగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని కామెంట్ చేశారు. ఆ పార్టీకి అనుకూలంగా ఉంటే తెలంగాణ మీడియా అంటున్నారని.. లేకపోతే అది ఆంధ్రా మీడియా అయిపోతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మీద ఉన్న కోపాన్ని టీవీ ఛానెళ్ల మీద చూపిస్తే ఎలా అని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో చేసిన తప్పులను టీవీ ఛానెళ్లు ప్రసారం చేయోద్దంటే అది కుదరని పని కదా.. అని ఎంపీ చామల సెటైర్లు వేశారు.






