- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పసుపు బోర్డు ఏమైందో.. అర్విందే చెప్పాలి: మంత్రి ఉత్తమ్ హాట్ కామెంట్స్
నిజామాబాద్ (Nizamabad)కు కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించిన పసుపు బోర్డు (Turmeric Board) ఏమైందో స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అర్విందే (Dharmapuri Arvind) చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ (Nizamabad)కు కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించిన పసుపు బోర్డు (Turmeric Board) ఏమైందో స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అర్విందే (Dharmapuri Arvind) చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. ఇవాళ ఆయన నిజామాబాద్ (Nizamabad)లో రైతు మహోత్సవాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageshwar Rao), జూపల్లి కృష్ణా రావు (Jupally Krishna Rao)తో కలిసి పారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పుసుపు బోర్డు ఏర్పాటు కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినా.. పూర్తి స్థాయిలో ఇంకా ఆ పనులు ప్రారంభం కాలేదని కామెంట్ చేశారు. తాను కూడా పసుపు బోర్డు కోసం ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు. ఇప్పటి వరకు పసుపు బోర్డు ఏమైందో స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అర్విందే చెప్పాలని అన్నారు.
గతంలో బియ్యం పంపీణీలో జోరుగా అక్రమాలు జరిగేవని.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. నిరుపేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం బోనస్ డబ్బులు పెండింగ్‌లో ఉంటే త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. ప్రాణహిత - చెవెళ్ల (Pranahitha - Chevella) ప్రాజెక్ట్ నిర్మించి ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతో ఉపయోగం ఉండేదని తెలిపారు. గత ప్రభుత్వం సాగు నీటి శాఖలపై రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా.. అదనంగా ఒక్క ఎకారానికి నీరు ఇవ్వలేదని అరోపించారు. నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్‌పీ ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. త్వరలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మరిన్ని చెక్ డ్యాం (Check Dams)లు మంజూరు చేస్తామని ప్రకటించారు. రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం సాగుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ అన్నారు.






