48 గంటల్లో ఏదో చేస్తా అన్నవ్! ICICI బ్యాంక్ ఏమన్నా ఉడిపి హోటలా? : ఎంపీ చామల కౌంటర్

by Ramesh Naini |   (  Updated:2025-04-11 11:09:46  IST  )

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

48 గంటల్లో ఏదో చేస్తా అన్నవ్! ICICI బ్యాంక్ ఏమన్నా ఉడిపి హోటలా? : ఎంపీ చామల కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైచ్‌సీయూ కంచ గచ్చిబౌలి భూముల వెనకాల రూ.10వేల కోట్ల స్కామ్‌కు (CM Revanth Reddy) రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నేతలు కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఎక్స్ వేదికగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల చీకటి కోణాన్ని 48 గంటల్లో బయట పెడుతా.. అది చేస్తా.. ఇది చేస్తా అన్నావ్.. చివరికి క్లారిటీ లేకుండా మాట్లాడవేం కేటీఆర్ అని విమర్శించారు. హైడ్రోజన్ బాంబు వేస్తానన్న కేటీఆర్.. ఎంత పెద్ద చప్పుడు అవుతుందో.. ఎన్ని ప్రణాలు కోల్పోతాయో, దేశం అల్లకల్లోలం అయిపోతుందని అనుకున్నాం.. చివరికి ఉల్లిగడ్డ బాంబ్ కూడా వేయకుండా వెళ్లిపోయావ్.. అని చామల సెటైర్లు వేశారు.

(Congress) ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, అది నువ్వు జీర్ణించుకోవడం లేదు అన్న అంశం మాత్రం నీ మాటల్లో స్పష్టమైందన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు అనేది ఏమన్నా ఉడిపి హోటల్ అనుకున్నావా ఏంటి? ఊరికే డబ్బులు ఇవ్వడానికి అని నిలదీశారు. వారికి తెలువదా? ఎలాంటి భూమికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి? ఎందుకు డబ్బులివ్వాలని ఇవ్వాలనేది? అని నిలదీశారు. బిల్లీరావుతో కలిసి ఆ భూమి కాజెయ్యాలనుకున్నావ్ కానీ, కుదర్లేదు.. ప్రెస్ మీట్‌లో ఆ అసంతృప్తి వెళ్ళగక్కావ్ అంతే అని ఆరోపించారు. ఎవరో ఎంపీ అన్నాడు.. ఆ ఎంపీ పేరు మాత్రం చెప్పడు.. చెప్పాలనుకున్నది ఏదో క్లారిటీగా చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి కేటీఆర్ ఇలా పొంకనాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

Next Story