Local Body Elections : ఏకగ్రీవాలపై ఏమంటారో ?...నేడు కీలక నిర్ణయం!

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-02-12 05:29:59.0  )
Local Body Elections : ఏకగ్రీవాలపై ఏమంటారో ?...నేడు కీలక నిర్ణయం!
X

దిశ, వెబ్ డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) నేడు రాజకీయ పార్టీల(Political Parties) తో నిర్వహించనున్న సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏకగ్రీవ(Unanimous) ఎన్నికల పద్ధతికి చెక్ పెట్టేందుకు ఈసీ చేయనున్న ప్రతిపాదనలకు రాజకీయ పార్టీలు ఆమోదిస్తాయా లేక తిరస్కరిస్తాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇటీవల ఏకగ్రీవ ఎన్నికల ప్రక్రియకు స్వస్తి పలకాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

అటు సుప్రీం కోర్టు సైతం ఏకగ్రీవ ఎన్నికలకు చెక్ పెడుతూ విధిగా ఎన్నికలు నిర్వహించాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు లేకుండా ఒక్క నామినేషన్ నమోదైనా.. నోటాను రెండో పోటీదారుగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఎన్నికల సంఘం ప్రతిపాదనలకు రాజకీయ పార్టీలు ఓకే చెప్పినా ప్రభుత్వం దీనికి అంగీకరిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీగా కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలిచేందుకు ఎమ్మెల్యేలు కృషి చేయాలని..వీలైనంత ఎక్కువ స్థానాలు ఏకగ్రీవాలు చేయాలంటూ ఇటీవల జరిగిన ఎమ్మెల్మేల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

ఈ దిశగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో సర్పంచ్ లు, వార్డు సభ్యుల ఏకగ్రీవాలకు కసరత్తు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ముగ్గురు మంత్రులు ఏకగ్రీవాలకు కుట్ర చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవాలకు సంబంధించి ఈసీ ప్రతిపాదనలపై రాజకీయ పార్టీల నిర్ణయం ఎలా ఉంటుందన్నది నేటి సమావేశంలో తేలిపోనుంది.

Next Story