- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లారంటే..
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2026-2027ను ఇవాళ డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ వార్షిక బడ్జెట్ 2026-2027ను ఇవాళ డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏఏ రంగాలకు ఎంత కేటాయింపులు చేశారో వివరించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను సోమవారానికి వాయిదా వేశారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బడ్జెట్‌పై మీడియా పాయంట్ వద్ద మాట్లాడారు. ఏ ఎమ్మెల్యే ఏం మాట్లాడారో ఇక్కడ చూద్దాం.
ప్రతిపక్షాలు నీళ్లు నమిలేలా ఉన్న జనరంజక బడ్జెట్: ఆది శ్రీనివాస్
రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధికి తోడ్పడే జనరంజక బడ్జెట్ . ప్రతిపక్షాలు నీళ్లు నమిలేలా ఉన్న బడ్జెట్. విద్యా శాఖకు ప్రాధాన్యం ఇచ్చిన బడ్జెట్. ఫోర్త్ సిటీ, మూసి నది ప్రక్షాళన అంశం ప్రస్తావన రాగానే వాకౌట్ చేశారు. ఎందుకు వాకౌట్ చేశారో తెలంగాణ ప్రజలకు సంధానం చెప్పాలి. గత ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధికి ఒక్క రూపాయి పదేళ్లలో ఇవ్వలేదు ఇందిరమ్మ జీవిత భీమా పథకం పేద ప్రజల సంక్షేమం కోసం ప్రతిపాదిస్తే ఇష్టం లేక బడ్జెట్ ప్రతులు బి.ఆర్.ఎస్ నేతలు చించివేశారు. పదేళ్లు అధికారంలో ఉండి పేద ప్రజలకోసం ఆలోచించలేకపోయాం అని ప్రతిపక్షం అనుకునే బడ్జెట్. దేశంలో ఇండ్ల నిర్మాణానికి ఏ రాష్ట్రం కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం లేదు. అలాంటిది అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
వీధిలో కొతుల్లా బీఆర్ఎస్ నేతల వ్యవహరం : రామంచంద్ర నాయక్
పదేళ్లు అన్ని వర్గాలను మోసం చేసి బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో వింత చేష్టలు చేస్తున్నారు. వీధిలో కోతుల్లా బి.ఆర్.ఎస్ నేతలు అసెంబ్లీలో వ్యవహరించారు. ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం, డిప్యూటీ సీఎంలకు ధన్యవాదాలు. విద్యా, వైద్య, ఇరిగేషన్ అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చిన బడ్జెట్. ఉద్యోగస్తులకు ప్రమాద బీమా పథకం, నగదు రహిత వైద్యం అందిస్తే ఇష్టం లేక బడ్జెట్ ప్రతులు చించివేశారు.
బడ్జెట్ వినని మీరు తెలంగాణ ద్రోహులు: బీర్ల అయిలయ్య
ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. అయినా ఇంకా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. బడ్జెట్ వినని బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ద్రోహులు. బాయ్ కాట్ చేసిన తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వక్రబుద్ధి మార్చుకొని ప్రజా ప్రభుత్వానికి సహకరించాలి. అసెంబ్లీలో అక్కసుతో వ్యవహరిస్తున్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే బడ్జెట్. వరి వేస్తే ఉరి అన్న వారి సన్న వడ్లకు కూడా బోనస్ ఇచ్చే బడ్జెట్. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంటర్మీడియట్ పేద విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తుంటే ఓర్వలేకపోతున్నారు.మిగిలిపోయిన ప్రాజెక్టులకు, రైతాంగానికి పెద్దపీట వేశాం. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులకు పెద్దపీట వేసిన బడ్జెట్.
బడ్జెట్ చూసి ప్రతిపక్షాల ముఖాలు రంగులు మారాయి: ఎన్నెం శ్రీనివాస రెడ్డి
పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేయకుండా బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షంలో ఉండి కారుకూతలు కూస్తున్నారు. బడ్జెట్ చూసి ప్రతిపక్షాల ముఖం రంగులు మారాయి. ఈ బడ్జెట్ తో.. భవిష్యత్ అభివృద్ధి వారి కళ్లకు కట్టినట్లుగా కనపడ్డది. బిఆర్ఎస్ నేతలు మానసికస్థితి కోల్పోయి అసెంబ్లీలో వింతగా ప్రవర్తించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షంలో కాదు, నర్సరీ తరగతిలో కూర్చోబెట్టాలని ప్రజలు అనుకుంటున్నారు. బీజేపీ సభ్యులు హుందాగా కూర్చొని బడ్జెట్ విన్నారు. తెలంగాణ భవిష్యత్తుకు రాజమార్గం వేసే అద్భుతమైన బడ్జెట్.
పదేళ్లు ప్రజల చెవిలో పువ్వు పెట్టారు.. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు పెట్టుకున్నారు: భూపతి రెడ్డి
1.15 లక్షల కుటుంబాలకు 5 లక్షల ఇన్సూరెన్స్, ఉద్యోగులకు బీమా, నగదురహిత వైద్యం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మంచి పథకాలతో విజన్ ఉన్న బడ్జెట్. పదేళ్లు ప్రజల చెవిలో పువ్వు పెట్టిన బీఆర్ఎస్ నేతలు ఈ రోజు ప్రజలు పెట్టిన పూలు పెట్టుకొని తిరుగుతున్నారు.






