- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్‌కు తెలంగాణతో ఏం పని..? ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూటి ప్రశ్న
పవన్ కల్యాణ్‌కు తెలంగాణతో ఏం పని అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఎవరు ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు ఉందని, అయితే, పొరుగు రాష్ట్ర నేతలు తెలంగాణపై విద్వేషం చిమ్మితే ఊరుకునేది లేదని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి (MLA Anirudh Reddy) ధ్వజమెత్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వైఖరిని తప్పుబడుతూ, ఉద్యోగుల విభజన అంశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అసలు పవన్‌కల్యాణ్‌కు తెలంగాణతో ఏం పని అని అన్నారు. ఆంధ్ర నేతలు కొందరు తెలంగాణపై పనిగట్టుకుని విషం చిమ్ముతుంటే, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు సైలెంట్‌గా ఉంటుందో సమాధానం చెప్పాలని అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు.
ఏపీలో తెలంగాణ ఉద్యోగుల కష్టాలు..
ఉద్యోగుల విభజన అంశంపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఏపీకి చెందిన ఉద్యోగులు తెలంగాణలో స్వర్గంలో ఉన్నట్లుగా సుఖంగా ఉన్నారని అన్నారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న మన తెలంగాణ ఉద్యోగులు (Telangana Employees) మాత్రం తీవ్ర కష్టాలు పడుతూ వివక్షకు గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీలో చిక్కుకుపోయిన తెలంగాణ ప్రాంత ఉద్యోగులందరినీ తక్షణమే ఇక్కడికి రప్పించాలని ప్రభుత్వానికి అనిరుధ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.






