రాష్ట్రంలో కొత్త పార్టీకి ఏం పని.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-27 09:31:16  IST  )

బీఆర్ఎస్ పార్టీ చనిపోయిన శవం లాంటిదని, దానికి ఇక మనుగడ లేదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కొత్త పార్టీకి ఏం పని.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ శాసనమండలిలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) పార్టీ భవిష్యత్తుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా ప్రయోజనం ఉండదు.. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉందని అన్నారు. ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని, దాని మనుగడ ప్రశ్నార్థకమైందని కామెంట్ చేశారు. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకారంతో వ్యవహరించారని, అందుకే ప్రజలు వారిని భరించలేక అధికారం నుంచి దించేశారని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీకి అసలు పనే లేదని, ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీనే ఉంటుందా.. ఊడుతుందా అనే స్థితికి చేరుకుందని కవిత పెట్టిన కొత్త పార్టీపై పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.

Next Story